Share News

నా జనం ఏమయ్యారు?

ABN , Publish Date - Sep 03 , 2024 | 03:56 AM

జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందుజగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు రోజుల పర్యటనలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. రెండు రోజుల పాటు ప్రజలను, నాయకులను కలిశారు. అయితే ఆయన గత మూడు పర్యటనల్లో ఎవరైతే వచ్చారో ఈసారి కూడా అదే జనం కనిపించారు. వారంతా వైఎస్‌ భాస్కరరెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి కుటుంబానికి విధేయులు. కానీ..

నా జనం ఏమయ్యారు?

  • పులివెందుల పర్యటనలో జగన్‌ విస్మయం

  • ఎంపీ, పార్టీ నేతలపై జగన్‌ ఆగ్రహం

కడప, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు రోజుల పర్యటనలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. రెండు రోజుల పాటు ప్రజలను, నాయకులను కలిశారు. అయితే ఆయన గత మూడు పర్యటనల్లో ఎవరైతే వచ్చారో ఈసారి కూడా అదేజనం కనిపించారు. వారంతా వైఎస్‌ భాస్కరరెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి కుటుంబానికి విధేయులు. కానీ పులివెందులకు చెందిన సామాన్య జనం మాత్రం మొహం చాటేశారు. తన కుటుంబానికి కంచుకోటగా భావించే పులివెందులలో తనను కలిసేందుకు స్థానిక ప్రజలు రాకపోవడం చూసి జగన్‌ ఆందోళనకు గురయ్యారంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి పులివెందులలో తన ఇంటికి జగన్‌ చేరుకునే సమయానికి అక్కడ ప్రజలు ఎవరూ లేరు. ఆదివారం ఆయన కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనాలైతే వచ్చారు కానీ పులివెందుల నియోజకవర్గంలోని ప్రజలు కనిపించలేదు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి కుటుంబం ఎవరిని చేరదీసిందో వారే అక్కడ కనిపించడం జగన్‌కు నచ్చలేదు.


YS-Jagan-Pulivenduula.jpg

ఎవరూ లేరా.. పట్టించుకోవా..?

అవినాశ్‌రెడ్డి చిన్నాన్న, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వైఎస్‌ మనోహర్‌రెడ్డి వచ్చిన సందర్భంలో ఓ ఐదారుగురు కౌన్సిలర్లు, చోటామోటా నాయకులు ఆయన వెంట వచ్చారని తెలిసింది. వెంటనే జగన్‌.. ‘నీకు వీరు తప్ప ఇంకెవరూ లేరా? ప్రజలు ఎవరినీ పట్టించుకోవా’ అని ఆయన ముఖంమీదే అడిగినట్టు తెలిసింది. ఆదివారం రాత్రి ప్రజాదర్బార్‌ ముగిసిన తర్వాత ఇంట్లో తన సతీమణి భారతి, అవినాశ్‌రెడ్డి, మరో ఒకరిద్దరు నాయకులు ఉన్న సమయంలో.. ‘పులివెందులలో ఏం జరుగుతోంది? గత మూడు పర్యటనలలో కనిపిస్తున్న వారే ఈ రోజూ కనిపించారు తప్ప సామాన్య ప్రజలు ఎవరూ ఎందుకు రావడం లేదు’ అని జగన్‌ ప్రశ్నించారని తెలిసింది. అవినాశ్‌రెడ్డిపై జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, ఫ్రస్టేషన్‌తో తల బాదుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన ఎంపీ అవినాశ్‌ రెడ్డి... బయటికి రాగానే ఎదురొచ్చిన తన పీఏ చెంపపై కొట్టినట్లు తెలిసింది.

YS-Jagan-Pulivenduula-Tour.jpg

Updated Date - Sep 03 , 2024 | 09:24 AM