Women's Gratitude : మొక్కు తీర్చుకున్న తెలుగు మహిళలు
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:13 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మహిళలు మొక్కు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా...

కూటమి విజయంతో గోదావరి మాతకు 1,008 బిందెల జలంతో అభిషేకం
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మహిళలు మొక్కు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కొంత మంది మహిళలు చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని.. ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ భారీ మెజార్టీతో విజయం సాధించాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొక్కుకున్నారు. ఆ రెండూ నెరవేరడంతో ఆదివారం మొక్కు చెల్లించుకున్నారు. అంగన్‌వాడీ కమిటీ నగర అధ్యక్షురాలు బోను ఈశ్వరి, తెలుగు మహిళా పార్లమెంట్ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో 1,008 బిందెల గోదావరి జలాలతో గోదావరి మాతకు అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, తెలుగు మహిళా నేతలు తురకల నిర్మల, గొర్రెల సత్యరమణి, మీసాల నాగమణి, మోతా నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.