Zodiac Sign : కొత్త ఏడాదిలో అదృష్టం తలుపు తట్టేది.. ఈ రాశివారినే..
ABN , Publish Date - Dec 27 , 2024 | 05:23 PM
జనవరి 2025లో ఈ రాశుల వారికి చాలా లక్కీ. కొత్త ఏడాది తొలిమాసంలో ముఖ్య గ్రహాల సంచారంతో వీరి జాతకమే మారిపోతుంది. మునుపెన్నడూ లేనివిధంగా అదృష్టం వీరిని వరిస్తుంది. నూతన సంవత్సరం ఏఏ రాశులవారికి కలిసిరానుందంటే..

2025 ఈ రాశులవారికి కీలకం కానుంది. జనవరిలో కీలక గ్రహాల సంచారంలో మార్పులు జరిగి అవి మనిషి జీవితంపై ప్రభావం చూపిస్తాయి. అయితే, జనవరిలో ముఖ్య గ్రహాల సంచారం ఈ రాశులవారి దశ, దిశను పూర్తిగా మార్చేయబోతోంది. సంక్రాంతి పండగ సమయంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించాక ద్వాదశ రాశుల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎదురైనా కొన్ని రాశుల వారికి మాత్రం 2025 శుభప్రదం కానుంది. కొత్త ఏడాది జనవరి వరప్రదాయినిగా మారి వారి ఇంట సిరుల పంట కురిపించడంతో పాటు అనుకున్న పనులు నెరవేరే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. నూతన సంవత్సరం తొలి మాసంలో ముఖ్య గ్రహాల సంచారం ఇలా ఉండనుంది. జనవరి 4న బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించి జనవరి 24న మళ్లీ మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెడతాడు. జనవరి 21 న కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. శని మాత్రం కుంభరాశి లోనే ఉంటాడు. వృషభ రాశిలోకి గురువు ప్రత్యక్షంగా వెళుతుంది. జనవరి 27న విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మీన రాశిలో సంచరిస్తాడు. ఈ గ్రహ సంచారాల వల్ల మొత్తంగా, 2025 కొత్త మాసం ఏఏ రాశుల వారికి కలిసిరానుందంటే..
కొత్త సంవత్సరంలో మొదటి మాసంలో ఏర్పడే మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాబోయే సంవత్సరంలో జనవరిలో ఏర్పడే గ్రహాల మార్పులు కొన్ని రాశుల వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. అలాగే, అనుకున్న కార్యాలు నిరాటంకంగా నెరవడంతో పాటు ఎన్నడూ ఊహించనంత డబ్బు ఈ రాశుల వారికి సొంతమవుతుంది. 2025 జనవరి మాసంలో ఎన్నడు చూడనంత ఐశ్వర్యం ఈ రాశులకే దక్కబోతోంది..
తులారాశి : కొత్త ఏడాదిలో జరిగే గ్రహాల మార్పులతో తులారాశి వారికి కలిసిరానుంది. ఈసారి ఈ జాతకులకు చాలా ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయి. ఏ సమమయంలో చేయాల్సిన పనిని వాయిదా వేయకుండా ఆ సమయంలో చేసుకుంటూ వెళితే అన్ని కార్యాల్లో జయం సిద్ధిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరకటంతో పాటు ఉద్యోగం చేసేవారికి పెద్ద బాధ్యతలు మీద పడతాయి. జీవిత భాగస్వామితో కలహాలు తొలగిపోయి సంతోషంగా జీవనం సాగిస్తారు. ఆశయాలు నెరవేర్చుకు నేందుకు అద్భుతమైన ప్రణాళికలు సఫలీకృతం అవుతాయి. ఆగిపోయిన పనులూ నిరాటంకంగా పూర్తవుతాయి. వర్తక వ్యాపారాల్లో ఈ రాశివారు ఇబ్బడిముబ్బడిగా లాభాలు పొందుతారు.
కుంభరాశి : 2025వ సంవత్సరం తొలిమాసం కుంభ రాశి వారి జీవితాల్లో అనూహ్య మార్పులు తీసుకురాబోతోంది. కుంభ రాశి జాతకులకు జనవరి మాసం అదృష్ట మాసంగా మారనుంది. ఆరోగ్యపరమైన సమస్యలు తొలగి జీవితం సుఖవంతంగా సాగుతుంది. ఈ రాశిలో అన్ని వయసుల వారికి మేలు చేకూరుస్తుంది. నిరుద్యోగులు, ఉద్యోగులు ఆర్థికంగా స్థిరపడతారు. దుబారా ఖర్చు చేయకుండా చూసుకుంటే డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. కష్టమైన సమస్యలు ఎదురైనా నిబ్బరంతో ముందుకెళ్లగలుగుతారు. వ్యాపారాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమిస్తారు. కుటుంబ కలహాలు, ఇంటి పనులు, ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వస్తాయి.
మేష రాశి : సహజంగా మృదుస్వాభావులు అయిన ఈ రాశి వారికి 2025 జనవరి నెల కలిసి వస్తుంది. మునుపటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వారికి అదృష్టాన్ని మోసుకొస్తోందనే చెప్పాలి. ఆగిపోయిన పనులు పూర్తయ్యేందుకు ఇది అనుకూలమైన సమయం. వీరు ఏ పని మొదలుపెట్టినా అన్నింటా విజయమే పలకరిస్తుంది. ఉద్యోగాల్లో స్థిరపడినవారికి మరింత ఎత్తుకు ఎదుగుతారు. ఆగిపోయిన పదోన్నతుల్లో పురోగతి ఉంటుంది. చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్యలు, ఇంటి సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. బంధుమిత్రులు, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎవరిపైనా అతిగా ఆధారపడకుండా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళితే మేషరాశివారికి 2025 సిరులు కురిపించనుంది.