Share News

హైదరాబాద్‌ టు బ్యాంకాక్‌ విమాన సర్వీసులు

ABN , Publish Date - Sep 13 , 2024 | 05:15 AM

ఎయిర్‌ ఏషియా థాయ్‌లాండ్‌.. భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌, చెన్నై నుంచి ఫుకెట్‌ నగరాలకు నేరుగా...

హైదరాబాద్‌ టు బ్యాంకాక్‌ విమాన సర్వీసులు

ఎయిర్‌ ఏషియా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎయిర్‌ ఏషియా థాయ్‌లాండ్‌.. భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌, చెన్నై నుంచి ఫుకెట్‌ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు థాయ్‌ ఎయిర్‌ ఏషియా కమర్షియల్‌ హెడ్‌ తన్సిటా ఆక్రారిట్‌పిరోమ్‌ వెల్లడించారు. అక్టోబరు 27వ తేదీ నుంచి హైదరాబాద్‌-బ్యాంకాక్‌ మార్గంలో వారానికి 4 సర్వీసులు, అదే నెల 30 నుంచి చెన్నై-ఫుకెట్‌ మార్గంలో వారానికి 3 సర్వీసులు నడపనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్‌ నుంచి బ్యాంకాక్‌కు ఒకవైపు ప్రయాణానికి టికెట్‌ ధరలు రూ.7,390, చెన్నై నుంచి ఫుకెట్‌కు టికెట్‌ ధరలు రూ.6,990 నుంచి ప్రారంభమవుతాయని ఆమె తెలిపారు. ఈ నెల 22 వరకు ఈ టికెట్‌ ధరలు బుకింగ్‌ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ఏడాది అక్టోబరు 27-30 తేదీల నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని ఆమె తెలిపారు.

Updated Date - Sep 13 , 2024 | 05:15 AM