13 రోజుల్లో రూ.27,856 కోట్లు | 27,856 crores in 13 days
Share News

13 రోజుల్లో రూ.27,856 కోట్లు

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:40 AM

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ భారత మార్కెట్‌పై దృష్టి పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో మార్కెట్‌ నుంచి రూ.34,252 కోట్లు ఉపసంహరించిన ఎఫ్‌పీఐలు సెప్టెంబరు 13నాటికి అందుబాటులో ఉన్న...

13 రోజుల్లో రూ.27,856 కోట్లు

సెప్టెంబరు నెలలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు

న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మళ్లీ భారత మార్కెట్‌పై దృష్టి పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో మార్కెట్‌ నుంచి రూ.34,252 కోట్లు ఉపసంహరించిన ఎఫ్‌పీఐలు సెప్టెంబరు 13నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ నెలలో రూ.27,856 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. భారత మార్కెట్లో గల అంతర్గత బలంతో పాటు అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న సంకేతాలు జూన్‌ నుంచి వారు పెట్టుబడుల దిశగా ఆకర్షితులు కావడానికి దోహదపడిన అంశాలని అంటున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి అమెరికన్‌ ఫెడరల్‌ సమావేశంలో తీసుకునే నిర్ణయం పైనే కేంద్రీకృతమై ఉంది. ఈ నిర్ణయమే సమీప కాలంలో భారత మార్కెట్లో వారి పెట్టుబడులను ప్రభావితం చేస్తుందని పరిశీలకులంటున్నారు. సెప్టెంబరు పెట్టుబడితో కలిపితే ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐ పెట్టుబడుల పరిమాణం రూ.70,737 కోట్లుంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

అమెరికాలో రేట్లు తగ్గితే మనకే లాభం: అమెరికన్‌ ఫెడరల్‌ వడ్డీరేట్ల నిర్ణయంపై ఈ వారంలో సమావేశం అవుతోంది. అక్కడ వడ్డీరేట్లు వరుసగా ఐదు నెలలుగా తగ్గుతూ ప్రస్తుతం 43 నెలల కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. ఈ కారణంగా ఈ వారంలో జరిగే సమావేశం నుంచే వడ్డీరేట్ల తగ్గింపును ప్రారంభించవచ్చునన్నది పరిశీలకుల అభిప్రాయం. అదే జరిగితే ఎఫ్‌పీఐ పెట్టుబడులు అమెరికా నుంచి వర్థమాన దేశాలకు...ప్రత్యేకించి మన దేశానికి మరలవచ్చునంటున్నారు. అయితే ప్రస్తుతం భారత ఈక్విటీల విలువలు గరిష్ఠంగా ఉండడం మాత్రం ఆందోళనకరమని చెబుతున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:40 AM