Share News

Gautam Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. మళ్లీ ఆసియా కుబేరుడిగా నిలిచిన పారిశ్రామిక దిగ్గజం!

ABN , Publish Date - Jun 02 , 2024 | 04:54 PM

అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ ``హిండెన్‌బర్గ్`` నివేదికతో భారీగా సంపదను కోల్పోయిన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ తిరిగి పుంజుకున్నారు. అసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారు. తాజాగా ఆయణ్ని అదానీ అధిగమించారు.

Gautam Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ.. మళ్లీ ఆసియా కుబేరుడిగా నిలిచిన పారిశ్రామిక దిగ్గజం!
Gautam Adani

అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ ``హిండెన్‌బర్గ్`` నివేదికతో భారీగా సంపదను కోల్పోయిన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ (Gautam Adani) తిరిగి పుంజుకున్నారు. అసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు (Asia's richest person). ఇప్పటివరకు ఆ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఉన్నారు. తాజాగా ఆయణ్ని అదానీ అధిగమించారు. ఇటీవలి కాలంలో అదానీ కంపెనీల షేర్లు భారీగా లాభపడడమే ముఖేష్ సంపద పెరగడానికి కారణం. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ (Bloomberg Index) తాజాగా బిలియనీర్స్ జాబితాను వెల్లడించింది.


అదానీ కంపెనీలకు అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ ఇటీవల సానుకూల రేటింగ్ ఇచ్చింది. దాంతో ఆయా కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. దీంతో కొత్తగా 84 వేల కోట్ల రూపాయలు మేర వచ్చి చేరింది. బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్ ప్రకారం.. 111 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. 109 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ 12వ స్థానంలో ఉన్నారు. అదానీకి చెందిన పది నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 17.51 లక్షల కోట్లను దాటింది. ఇక, రాబోయే పదేళ్లలో 9 బిలియన్ డాలర్లతో వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది.


నిజానికి 2022లోనే అదానీ అసియాలోని నెంబర్ వన్ ధనవంతుడిగా నిలిచారు. అయితే అదానీ కంపెనీల్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయని, భారీగా అప్పులు పేరుకుపోయాయని అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ ``హిండెన్‌బర్గ్`` ఓ నివేదికను (Hindenburg report) వెలువరించింది. దీంతో గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో అదానీ షేర్లు పతనమయ్యాయి. ఎన్నో బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఆ తర్వాత తీసుకున్న దిద్దుబాటు చర్యల కారణంగా షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. 2014లో కేవలం 5 బిలియన్ డాలర్ల సంపదను మాత్రమే కలిగి ఉన్న అదానీ కేవలం పదేళ్లలో 111 బిలియన్ డాలర్లు సంపదకు అధిపతి కావడం విశేషం.

ఇవి కూడా చదవండి..

Viral Video: అనంత్ అంబానీ-రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాప్ సింగర్ల ప్రదర్శన


Sensex: ఎగ్జిట్ పోల్ తర్వాత సెన్సెక్స్ టార్గెట్ 80,000..చేరుకుంటుందా?


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 02 , 2024 | 04:54 PM