Piyush Goyal Comments: మా ఆత్మ స్థైర్యాన్ని నీరుగార్చొద్దు
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:09 AM
కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ భారత స్టార్టప్ వ్యవస్థలో విలువ, ఇన్నోవేషన్ లోపించాయంటూ చేసిన వ్యాఖ్యలను పలువురు పారిశ్రామికవేత్తలు ఖండించారు. జెప్టో సీఈఓ అదిత్ పలీచా, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తమ కంపెనీల దృష్టిని మరియు భారత ఇన్నోవేషన్ వ్యవస్థలో ఉన్న వాటాను సమర్థించారు

పీయూష్ గోయెల్‌కు స్టార్ట్‌ప్స అధినేతల వినతి
న్యూఢిల్లీ: భారత స్టార్టప్ వ్యవస్థలో విలువ, ఇన్నోవేషన్ లోపించాయంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ చేసిన వ్యాఖ్యలను పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముక్తకంఠంతో ఖండించారు. తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయవద్దని, తమ సామర్థ్యాలు సంపూర్ణంగా ఉపయోగించుకునేలా వెన్ను తట్టి ప్రోత్సహించాలని ఆయనకు సూచించారు. వారిలో క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో సీఈఓ అదిత్ పలీచా, జోహో వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీధర్ వెంబు ఉన్నారు. స్టార్టప్ మహాకుంభ్‌లో గురువారం గోయెల్ చేసిన వ్యాఖ్యలపై పెద్దఎత్తున దుమారం రేగుతోంది. ఉద్యోగాలు, ఎఫ్‌డీఐ వంటి విభాగాలకు తమ కంపెనీ అందిస్తున్న వాటా ‘‘భారత ఇన్నోవేషన్ వ్యవస్థలోనే ఒక అద్భుతం’’ అని పలీచా వ్యాఖ్యానించారు. లక్ష్య సాధన దిశగా చురుగ్గా కృషి చేస్తున్న బృందాలను వెనక్కి లాగడం మానుకుని విభిన్న రంగాల్లో ‘‘స్థానిక చాంపియన్ల’’ను సృష్టించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
Read More Business News and Latest Telugu News