Share News

Gold and Silver Prices: భారీగా తగ్గిన బంగారం, వెండి

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:17 AM

పసిడి ధరలు ఆల్‌ టైమ్‌ రికార్డు స్థాయిల నుండి గణనీయంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.93,000కి చేరింది. అలాగే, వెండి ధర కూడా ₹95,500కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు తగ్గడంతో ఈ తగ్గుదల జరిగినది

Gold and Silver Prices: భారీగా తగ్గిన బంగారం, వెండి

  • 10 గ్రాములపై రూ.1,350 తగ్గుదలతో రూ.93,000కు దిగివచ్చిన పసిడి

  • కిలో వెండి రూ.5,000 డౌన్‌

  • అంతర్జాతీయ మార్కెట్లో 3,045 డాలర్లకు ఔన్స్‌ గోల్డ్‌

న్యూఢిల్లీ: పసిడి ధరలు ఆల్‌ టైమ్‌ రికార్డు స్థాయి నుంచి గణనీయంగా తగ్గాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం 10 గ్రాముల ధర రూ.1,350 తగ్గుదలతో రూ.93,000కు దిగివచ్చింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం సైతం అదే స్థాయిలో తగ్గి రూ.92,550 ధర పలికింది. దాంతో గోల్డ్‌ ధరల 5 రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. వెండి విషయానికొస్తే, కిలోపై ఏకంగా రూ.5000 తగ్గి రూ.95,500కు జారుకుంది. వెండికి గత నాలుగు నెలల్లో ఇదే అతిపెద్ద తగ్గుదల. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు బాగా తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంటర్నేషనల్‌ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు (జూన్‌ డెలివరీ) ధర ఒక దశలో 2.60 శాతం క్షీణించి 3,042 డాలర్లకు పడిపోయింది. సిల్వర్‌ 6.75 శాతం పతనమై 29.83 డాలర్లకు దిగివచ్చింది.


ఇవి కూడా చదవండి:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..


Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Loan Charges: ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 05 , 2025 | 04:18 AM