గూగుల్ క్లౌడ్‌తో ఎల్4జీ జట్టు
ABN , Publish Date - Jul 20 , 2024 | 05:43 AM
విద్య, నైపుణ్యాభివృద్ధిలో కీలకంగా ఉన్న ఎల్4జీ (లెర్నింగ్ ఫర్ గ్రోత్) సొల్యూషన్స్.. గూగుల్ క్లౌడ్ ఇండియాతో కలిసి జెనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది.
హైదరాబాద్: విద్య, నైపుణ్యాభివృద్ధిలో కీలకంగా ఉన్న ఎల్4జీ (లెర్నింగ్ ఫర్ గ్రోత్) సొల్యూషన్స్.. గూగుల్ క్లౌడ్ ఇండియాతో కలిసి జెనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో లక్ష మంది విద్యార్ధులకు ఉచితంగా శిక్షణను అందించనుంది. ఇందులో భాగంగా గూగుల్ క్లౌడ్ స్కిల్స్ బూస్ట్ (జీసీఎ్‌సబీ) ప్లాట్‌ఫామ్ ద్వారా అవసరమైన కంటెంట్‌ను గూగుల్ క్లౌడ్ అందిస్తుంది. డెవలపర్ల కోసం జెనరేటివ్ ఏఐ, జెమినీ ఫర్ గూగుల్ క్లౌడ్‌లో లెర్నింగ్ పద్దతులను ఆఫర్ చేయనుంది. అలాగే జీసీఎ్‌సబీ ప్లాట్‌ఫామ్‌పై కెరీర్ లాంచ్‌పాడ్ కార్యక్రమం కింద లెర్నర్స్‌కు ఉచితంగా లెర్నింగ్ విధానాలను అందించనుంది. కోర్సు పూర్తయిన అనంతరం లెర్నర్స్‌కు కంప్లీషన్ బ్యాడ్జ్‌ను అందించనున్నట్లు ఎల్4జీ సొల్యూషన్స్ తెలిపింది.