Share News

Oil Rates Hike: ఇవేం ధరలు బాబోయ్.. ఆందోళనలో సామాన్యులు..

ABN , Publish Date - Nov 16 , 2024 | 12:59 PM

దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ నిత్యావసరాలు, ముఖ్యంగా నూనెల ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యులు, అతి సామాన్యులు ఇవేం ధరలు బాబోయ్ అంటూ లబోదిబోమంటున్నారు.

Oil Rates Hike: ఇవేం ధరలు బాబోయ్.. ఆందోళనలో సామాన్యులు..

Oil Rates Hike: ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. వంట నూనెలు కాగిపోతున్నాయి. కొనకుండా ఉండలేని పరిస్థితి. కొనేందుకు డబ్బులు లేని దుస్థితి. పండుగ సీజన్ లో ఏమీ చేయలేని ఆదోగతి తెలుగు రాష్ట్ర ప్రజల దీనస్థితి. మార్కెట్ లోకి వెళ్లి ఏం కొనాలన్నా వెన్నులో వణుకుపుడుతుంది. ధరలు అమాంతం పెరిగిపోవడంతో వినియోగదారుడికి దిక్కుతోచడం లేదు.

బెంబేలెత్తిస్తున్న ధరలు..

ధరలు చుక్కలనంటుతున్నాయి.. ధనం అడుగంటిపోతుంది. సామాన్య, మధ్య తరగతుల జీవితం దుర్భరమవుతుంది. తిండి తినకుండా ఉండలేక.. కొనేందుకు డబ్బులు లేక సామాన్య జనం నానా తంటాలు పడుతున్నారు. ధరలు నియంత్రణకు రావాలని వేడుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ నిత్యావసరాలు, ముఖ్యంగా నూనెల ధరలు పెరిగిపోతున్నాయి. రోజు వాడే కూరగాయల ధరలు 34 నుంచి 40 శాతం వరకు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వాటికి తోడు వంటనూనెల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఏ కూర వండాలన్నా, ఏ వంట చేయాలన్నా వంటనూనె ప్రధానం. ఇప్పుడు ఆ వంట నూనెల ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. పండుగలు, పబ్బాలకు కనీసం పిండి వంటలు వండుకునే పరిస్థితి లేదు. సామాన్యలు, అతి సామాన్యలు ఇవేం ధరలు బాబోయో అంటూ లబోదిబోమంటున్నారు.

ప్రభుత్వం పూనుకుంటేనే..

ఇటీవల కాలంలో సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ. 115 నుంచి 150కి పెరిగింది. కిరాణా షాప్ లో లీటర్ ధర సన్ ఫ్లవర్ ఆయిల్ రూ. 155 నుంచి 160 వరకు అమ్ముతున్నారు. దసరా పండుగకు ముందే పామాయిల్ లీటర్ ధర రూ. 95 ఉండగా ఇప్పుడు రూ. 130కి పెరిగింది. వేరు శెనగనూనె లీటర్ 145 ఉండగా రూ. 165కి పెరిగింది. దీపారాధనకు ఉపయోగించే నూనె సైతం రూ. 108 నుంచి 130కి చేరింది. సన్ ఫ్లవర్ నూనె 15 లీటర్ల టీన్ రూ. 1750 నుంచి 2000కి పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు అసహనంతో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోనూ ధరలు వీపరితంగా పెరిగాయి. ప్రభుత్వం పూనుకుంటేనే ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.

Updated Date - Nov 16 , 2024 | 12:59 PM