Stock Market: రోజంతా ఒడిదుడుకులు.. రెండో రోజూ స్వల్ప లాభాలతోనే ముగిసిన సూచీలు..!
ABN , Publish Date - Jul 30 , 2024 | 04:02 PM
త్రైమాసిక ఫలితాల సీజన్ కావడం, కొన్ని సంస్థల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే తరహాలో రోజును ముగించాయి.
త్రైమాసిక ఫలితాల సీజన్ కావడం, కొన్ని సంస్థల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే తరహాలో రోజును ముగించాయి. రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్, నిఫ్టీ చివరకు ఫ్లాట్‌గా రోజును ముగించాయి. సెన్సెక్స్ 99 పాయింట్లు, నిఫ్టీ 21 పాయింట్లు లాభపడ్డాయి. (Business News).
సోమవారం ముగింపు (81, 355)తో పోల్చుకుంటే దాదాపు ఫ్లాట్‌గా ఓపెన్ అయిన సెన్సెక్స్ రోజంతా అనిశ్చిత్తిలోనే కదలాడింది. లాభనష్టాలతో దోబూచులాడింది. మంగళవారం నాడు సెన్సెక్స్ 81, 230- 81, 815 శ్రేణి మధ్య కదలాడింది. ఒక దశలో దాదాపు 500 పాయింట్లకు పైగా లాభపడినా చివరకు కిందకు దిగి రాకతప్పలేదు. చివరకు 99 పాయింట్ల లాభంతో 81, 455 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా అదే బాటలో పయనించింది. ఒక దశలో 140 పాయింట్లకు పైగా ఎగబాకి చివరకు 21 పాయింట్ల లాభంతో 24, 857 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లో నవీన్ ఫ్లోరోసెంట్, ఆర్తి ఇండస్ట్రీస్, కోల్గేట్, గ్రాన్యుయల్స్ ఇండియా షేర్లు లాభాలు ఆర్జించాయి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, టోరంట్ ఫార్మా, గోద్రేజ్ కన్స్యూమర్, ఎల్‌ఐసీ హౌసింగద్ ఫైనాన్స్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 261 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 930 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.73గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధర
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..