Share News

Hyderabad: ప్రేమ, పెళ్లి పేరుతో పలువురికి వల.. సైబర్‌ మోసగాడి అరెస్ట్‌

ABN , Publish Date - May 25 , 2024 | 12:04 PM

ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకొని, ప్రేమ, పెళ్లి పేరుతో అందినకాడికి దోచేస్తున్న ఘరానా సైబర్‌ నేరగాడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం(Cyberabad Cybercrime) పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Hyderabad: ప్రేమ, పెళ్లి పేరుతో పలువురికి వల.. సైబర్‌ మోసగాడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకొని, ప్రేమ, పెళ్లి పేరుతో అందినకాడికి దోచేస్తున్న ఘరానా సైబర్‌ నేరగాడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం(Cyberabad Cybercrime) పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికల్లో అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్‌ తయారు చేసిన మారం అశోక్‌రెడ్డి(23) అబ్బాయిలకు వల వేస్తున్నాడు. స్నాప్‌చాట్‌లో ప్రణీతారెడ్డి పేరుతో నకిలీ ఖాతాను సృష్టించాడు. దీని ద్వారా యువకులకు ఫ్రెండ్‌ రిక్వెస్టులు పెట్టేవాడు. అమ్మాయిలా చాటింగ్‌ చేస్తూ, అప్పుడప్పుడు నమ్మించేందుకు ఫొటోలు పెట్టేవాడు. వారితో చాటింగ్‌ చేస్తూ వారిని ప్రేమ, పెళ్లి వరకు తీసుకువస్తున్నాడు. అత్యవసరంగా డబ్బులు కావాలి, ఆరోగ్యం బాగోలేదు, వ్యాపారం పెట్టాలి తదితర కారణాలు చూపుతూ యువకుల నుంచి డబ్బు కాజేస్తున్నాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: భార్యను హత్య చేసిన భర్త.. ఘటన ఆలస్యంగా వెలుగులోకి


మారం అశోక్‌రెడ్డిపై ఇప్పటివరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌(Cyberabad Commissionerate) పరిధిలో 3 కేసులు నమోదయ్యాయి. తాజాగా నగరానికి చెందిన యువకుడికి ప్రణీతారెడ్డి పేరుతో స్నాప్‌చాట్‌లో పరిచయమయ్యాడు. స్నేహం, ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరయ్యాడు. అవసరం ఉందంటూ పలు దఫాలుగా రూ. 14లక్షలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు నిందితుడు అశోక్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అశోక్‌రెడ్డి పలువురిని మోసం చేసి సంపాదించిన డబ్బును వివిధ యాప్‌లు, సైట్లలో బెట్టింగ్‌లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu Newshy

Updated Date - May 25 , 2024 | 12:04 PM