Diksuchi : తెలంగాణ అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్
ABN , Publish Date - Jul 21 , 2024 | 03:55 AM
హైదరాబాద్-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీఎ్‌సఏయూ)- వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
హైదరాబాద్-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీఎ్‌సఏయూ)- వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అగ్రిసెట్-2024 ద్వారా బీఎస్సీ ఆనర్స్(అగ్రికల్చర్); అగ్రి ఇంజనీరింగ్ సెట్-2024 ద్వారా బీటెక్(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. వ్యవసాయ సంబంధిత విభాగాల్లో డిప్లొమా పూర్తిచేసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అగ్రిసెట్
అర్హత: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీఎ్‌సఏయూ)/ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఏఎన్‌జీఆర్‌ఏయూ) నుంచి డిప్లొమా(అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ) పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. జయశంకర్ వర్సిటీ నుంచి ఆర్గానిక్ అగ్రికల్చర్ డిప్లొమా, ఎన్‌జీ రంగా వర్సిటీ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 2024 డిసెంబరు 31 నాటికి జనరల్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులకు 17 నుంచి 22 ఏళ్ల మధ్య; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య; దివ్యాంగులకు 17 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
సీట్లు: బీఎస్సీ ఆనర్స్(అగ్రికల్చర్) ప్రోగ్రామ్‌లో మొత్తం 92 సీట్లు ఉన్నాయి. వీటిలో అగ్రికల్చరల్ డిప్లొమా అభ్యర్థులకు 76, సీడ్ టెక్నాలజీ అభ్యర్థులకు 7, ఆర్గానిక్ అగ్రికల్చర్ అభ్యర్థులకు 9 సీట్లు ప్రత్యేకించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద అగ్రికల్చరల్ డిప్లొమా అభ్యర్థులకు 7, సీడ్ టెక్నాలజీ అభ్యర్థులకు 1, ఆర్గానిక్ ఫార్మింగ్ అభ్యర్థులకు 1 చొప్పున మొత్తం 9 సీట్లు; సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద అగ్రికల్చరల్ డిప్లొమా అభ్యర్థులకు 29, సీడ్ టెక్నాలజీ అభ్యర్థులకు 2, ఆర్గానిక్ అగ్రికల్చర్ డిప్లొమా అభ్యర్థులకు 3 చొప్పున మొత్తం 34 సీట్లు కేటాయించారు.
అగ్రి ఇంజనీరింగ్ సెట్
అర్హత: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీఎ్‌సఏయూ)/ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ఏఎన్‌జీఆర్‌ఏయూ) నుంచి డిప్లొమా(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 2024 డిసెంబరు 31 నాటికి జనరల్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులకు 17 నుంచి 23 ఏళ్ల మధ్య; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య; దివ్యాంగులకు 17 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
సీట్లు: బీటెక్(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) ప్రోగ్రామ్‌లో 8 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఒక సీటు, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద ఒక సీటు కేటాయించారు.
ఎంట్రెన్స్ టెస్ట్‌ల వివరాలు: ఇవి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు. ఒక్కో టెస్ట్‌లో మొత్తం 100 ‘మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు’ ఇస్తారు. అభ్యర్థులు డిప్లొమాలో ఎంచుకొన్న విభాగంలోనే సంబంధిత ఎంట్రెన్స్ టెస్ట్ రాయాలి.
అగ్రిసెట్ అభ్యర్థులకు అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ/ఆర్గానిక్ అగ్రికల్చర్ డిప్లొమా సిలబస్ నుంచి, అగ్రి ఇంజనీరింగ్ సెట్ అభ్యర్థులకు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
వీటితోపాటు జయశంకర్ వర్సిటీ అభివృద్ధి చేసిన టెక్నాలజీ, నూతన ఉత్పత్తులు; జనరల్ అగ్రికల్చర్; వ్యవసాయానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు, జనరల్ ఇంగ్లీష్, బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్ అంశాలనుంచి ప్రశ్నలు ఇస్తారు. అగ్రిసెట్‌ను తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో, అగ్రి ఇంజనీరింగ్ సెట్‌ను ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1400; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.700
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 9
హాల్ టికెట్స్ డౌన్‌లోడింగ్: ఆగస్టు 17 నుంచి
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్.
అగ్రిసెట్ 2024, అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2024 తేదీ: ఆగస్టు 24
వెబ్‌సైట్‌లో ప్రశ్న పత్రాలు, సంబంధిత కీ అందుబాటులో ఉండే తేదీలు: ఆగస్టు 28 నుంచి 29 వరకు
వెబ్‌సైట్: WWW.pjtsau.edu.in