Share News

AP Elections 2024: రేపే కూటమి మేనిఫెస్టో.. సర్వత్రా ఉత్కంఠ

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:41 PM

Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రేపే (మంగళవారం) కూటమి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు.

AP Elections 2024: రేపే కూటమి మేనిఫెస్టో.. సర్వత్రా ఉత్కంఠ
TDP - Janasena - BJP Manifesto

అమరావతి, ఏప్రిల్ 29: ఏపీలో ఎన్నికలకు (AP Elections 2024) సమయం దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ (YSRCP) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీల (TDP - Janasena - BJP) ఉమ్మడి మేనిఫెస్టోకు (Manifesto) ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రేపే (మంగళవారం) కూటమి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan), బీజేపీ ముఖ్యనాయకుల సమక్షంలో మేనిఫెస్టో విడుదలకానుంది.

AP Election 2024: నేతలకు పార్టీలు శాశ్వతం కాదంటే ఇదేనేమో!.. వీరశివారెడ్డి రూటే వేరబ్బ...


మేనిఫెస్టోపై సుదీర్ఘ కసరత్తు..

2023 రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలను టీడీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూటమిగా ఏర్పడి మూడు పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. మూడు పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టో ఉండనున్నట్లు సమాచారం. మేనిఫెస్టో అంశాలపై మూడు పార్టీల నేతలతో కూడిన మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘ కసరత్తు చేసింది. "రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం... రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం" అనే థీమ్‌తో మేనిఫెస్టో ఉండనున్నట్లు తెలుస్తోంది. అధిక పన్నులు, టాక్స్‌ల బాదుడు లేని సంక్షేమం – ప్రతి ప్రాంతంలో అభివృద్ధి అనే కాన్సెప్ట్‌తో మేనిఫెస్టోను రూపొందించినట్లు సమాచారం. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని... సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామని కూటమి నేతలు చెబుతున్నారు.

Brother Anil Kumar: న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం.. ఎవరికీ భయపడవద్దు..


సర్వత్రా ఉత్కంఠ..

వచ్చే 5 ఏళ్లలో చేసే అభివృద్ధిపై స్పష్టమైన రోడ్ మ్యాప్‌తో మేనిఫెస్టో ఉండబోతోంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు, ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటుందని కూటమి చెబుతోంది. పథకాలకు నిథుల సమీకరణపై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. లబ్దిదారులు, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత అంశాలపై లోతైన కసరత్తు తరువాతనే పధకాల డిజైన్ అని కూటమి నేతలు అంటున్నారు. తమ సూపర్ సిక్స్ ముందు ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో రేపు విడుదల కాబోయే కూటమి మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి...

Supreme Court: ఇసుక తవ్వకాలపై సుప్రీం ఫైర్.. నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం

Dhulipalla Narendra: జగన్‌కి కప్పం కడితే దోపిడి, హత్యలకు పర్మిషన్ ఇస్తారు

Read Latest AP News AND Telugu News

Updated Date - Apr 29 , 2024 | 03:14 PM