Share News

CM Revanth Reddy: కొన్ని గంటల్లో ఎన్నికలు.. టెన్షన్‌లో పార్టీలు.. రేవంత్ మాత్రం ఓ ఆట ఆడుకున్నారు..

ABN , Publish Date - May 12 , 2024 | 10:24 AM

ఒకవైపు సార్వత్రిక ఎన్నికలకు కొద్ది గంటలే సమయం ఉంది. పార్టీల అధినేతలంతా టెన్షన్ టెన్షన్‌గా క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలే అయినా కూడా పార్టీలన్నీ ప్రెస్టీజియస్‌గానే తీసుకున్నాయి. ఢిల్లీ నుంచి పెద్దలను పిలిపించి మరీ ప్రచారం చేయించాయంటే ఎన్నకలను పార్టీలు ఎంత సీరియస్‌గా తీసుకున్నాయో అర్థమవుతున్నాయి.

CM Revanth Reddy: కొన్ని గంటల్లో ఎన్నికలు.. టెన్షన్‌లో పార్టీలు.. రేవంత్ మాత్రం ఓ ఆట ఆడుకున్నారు..

ఒకవైపు సార్వత్రిక ఎన్నికలకు కొద్ది గంటలే సమయం ఉంది. పార్టీల అధినేతలంతా టెన్షన్ టెన్షన్‌గా క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలే అయినా కూడా పార్టీలన్నీ ప్రెస్టీజియస్‌గానే తీసుకున్నాయి. ఢిల్లీ నుంచి పెద్దలను పిలిపించి మరీ ప్రచారం చేయించాయంటే ఎన్నకలను పార్టీలు ఎంత సీరియస్‌గా తీసుకున్నాయో అర్థమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బయటకు రాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం బయటకొచ్చి పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కొన్ని గంటలు పార్టీలకు నరాలు తెగే ఉత్కంఠ సమయం. ఈ టైంలో సీఎం రేవంత్ రెడ్డి కూల్‌గా ఫుట్ బాల్ ఆడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Secunderabad: ప్రయాణ కష్టాలు.. స్వగ్రామాలకు వెళ్లేందుకు పడరానిపాట్లు


హైదరాబాద్: రేవంత్ హైదరాబాద్ సెంట్రల్ యూవర్సిటీల ఫుట్ బాల్ ఆడారు. ఎన్నికల టెన్షన్‌కు కాసేపు బ్రేక్ ఇచ్చి మాయిగా ఫుట్ బాల్ ఆడారు. అయితే ఈ ఫుట్ బాల్ ఆడుతుండగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆట మధ్యలో రేవంత్ షూస్ పాడైపోయాయి. దీంతో షూస్ లేకుండా ఫుల్ బాల్ ఆడారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీ బల్మార్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , టీఎంఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్‌సీయూ ఎన్ఎస్యూఐ యూనిట్, హెచ్‌సీయూ విద్యార్థులు ఫుట్ బాల్ ఆడారు. ఈ ఫుట్ బాల్ మ్యాచ్‌కి హాజరైన సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏంఏ ఫహీం, టీ శాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి ఇతరులు హాజరయ్యారు.

ఇదికూడా చదవండి: ప్రలోభాలపైనే బీజేపీ, కాంగ్రెస్‌ ఆశలు : హరీశ్‌

Read Latest Telangana News and National News

Updated Date - May 12 , 2024 | 10:24 AM