Share News

Hyderabad: ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి..

ABN , Publish Date - May 12 , 2024 | 09:41 AM

కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక, లోక్‌సభ ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని హైదరాబాద్‌ సీపీ కె.శ్రీనివాస్‏రెడ్డి(Hyderabad CP K. Srinivas Reddy) సిబ్బందిని

Hyderabad: ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి..

హైదరాబాద్‌ సిటీ: కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక, లోక్‌సభ ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని హైదరాబాద్‌ సీపీ కె.శ్రీనివాస్‏రెడ్డి(Hyderabad CP K. Srinivas Reddy) సిబ్బందిని ఆదేశించారు. శనివారం గోషామహల్‌లోని శివకుమార్‌లాల్‌ స్టేడియం, పేట్లబురుజులోని సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్‌ సిబ్బంది, హోంగార్డులు, టీఎస్‌ న్యాబ్‌, టీఎస్ఐసీసీసీ, సీసీఎస్‌ అధికారులతో సీపీ సమావేశం నిర్వహించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 14 ఏళ్ల బాలికతో బలవంతంగా వ్యభిచారం..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేయడం, నగదు పంపిణీని అరికట్టడం, నాయకులు ఓటర్లకు పంపిణీ చేయడానికి ప్రయత్నించే ఉచితాలను స్వాధీనం చేసుకోవడం గురించి వివరించారు. కల్యాణ మండపాలు, లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూల నిర్వహణ, పోలింగ్‌ సిబ్బంది ఇచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని అధికారులకు దిశానిర్థేశం చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సాయంత్రం 6 తర్వాత కూడా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో క్యూలో ఉంటే ప్రిసైడింగ్‌ అధికారి సూచనతో ఓటు వేయడానికి అనుమతించనున్నట్టు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్స్‌ అనుమతించొద్దని పోలీసులను ఆదేశించారు.

ఇదికూడా చదవండి: ప్రలోభాలపైనే బీజేపీ, కాంగ్రెస్‌ ఆశలు : హరీశ్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 12 , 2024 | 09:41 AM