Share News

Organic Foods: ఆర్గానిక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయా? వైద్యుల చెప్పేదేంటంటే..

ABN , Publish Date - Nov 02 , 2024 | 10:26 AM

ఆర్గానిక్ ఫుడ్స్‌తో కలిగే ప్రయోజనాల గురించి ప్రజల్లో రకరకాల సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ విషయమై నిపుణులు సవివరమైన సమాధానమే ఇస్తున్నారు.

Organic Foods: ఆర్గానిక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయా? వైద్యుల చెప్పేదేంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ, ఇందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెరిగింది. ఫలితంగా ఆర్గానిక్ ఫుడ్స్‌కు డిమాండ్ కూడా పెరుగుతోంది. అయితే, ఈ ఆహారాల విషయంలో ఇప్పటికీ ప్రజల్లో కొంత అవగాహనా రాహిత్యం ఉంది. ఇవి సాధారణ కాయగూరలకంటే మెరుగైనవేనా? నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తాయా? అని కొందరు సందేహిస్తుంటారు. మరి ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఏంటో, వీటితో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం (Organic foods).

Water Intoxication: అతిగా నీరు తాగుతున్నారా? వాటర్ ఇంటాక్సికేషన్ గురించి తెలిస్తే..


ఏమిటీ ఆర్గానిక్ ఫుడ్స్?

క్రిమిసంహాకరాలు, ఎరువులు, జన్యుమార్పిడి విధానాలు లేకుండా పెంచిన వ్యవసాయ ఉత్పత్తులను ఆర్గానిక్ ఫుడ్స్ అంటారు. వీటిని పెంచేందుకు సుస్థిర వ్యవసాయ విధానాలు, సహజసిద్ధమైన పద్ధతులు అవలంబిస్తారని వైద్యులు చెబుతున్నారు. సహజసిద్ధమైన పద్ధతుల్లో చీడపీడలు సోకకుండా చూస్తారు. పర్యావరణానికి హానికలగని వ్యవసాయ విధానాలను అనుసరిస్తారు.

అయితే, నేచురల్ ఫుడ్స్, ఆర్గానిక్‌ ఫుడ్స్ మధ్య తేడాను తెలుసుకోవాలని కూడా నిపుణులు చెబుతున్నారు. నేచుల్ ఫుడ్స్ అంటే కృత్రిమ రంగులు, రుచులు, లేదా ప్రిజర్వేటివ్స్ వాడనివని అర్థం. ఇక ఆర్గానిక్ కాయగూరలు, ధాన్యం, పప్పులను మాత్రం పూర్తి పర్యావరణహిత పద్ధతుల్లో, క్రిమిసంహారకాలు వాడకుండా పెంచుతారు.

Viral: రోజూ ఈ టైంలో 15 నిమిషాల పాటు ఎండలో నిలబడితే సమృద్ధిగా విటమిన్ డీ!


ఆర్గానిక్ ఫుడ్స్‌తో ప్రయోజనాలు

ఆర్గానిక్ ఫుడ్స్‌లో యాంటీఆక్సిడెంట్స్, కొన్ని మినరల్స్, విటమిన్లు సాధారణ ఫుడ్స్‌లో కంటే కొంత ఎక్కువగానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇదేమీ భారీ వ్యత్యాసం కాదని అంటున్నారు. ఉదాహరణకు విటమిన్ సీకి సంబంధించి వీటి మధ్య తేడా స్వల్పంగానే ఉంటుంది. మినరల్స్ స్థాయిల్లో కూడా స్వల్ప వ్యత్యాసమే ఉంటాయి. అయితే, సాధారణ ఫుడ్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని, ఆర్గానిక్ ఫుడ్స్‌ను స్థానికంగానే వినియోగిస్తారు కాబట్టి అవి తాజాగా ఉండే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. ఇక, ఆర్గానిక్ ఫుడ్స్‌లో క్రిమిసంహారకాలు లేకపోవడం అతిపెద్ద ప్రయోజనమని కొందరు వైద్యులు చెప్పే మాట. కానీ, వీటిల్లో ప్రిజర్వేటివ్స్ ఉండకపోవడంతో త్వరగా పాడయ్యే అవకాశాలు ఎక్కువ. వీటి ధర కూడా ఎక్కువగా ఉండటంతో అల్పాదాయ వర్గాలు ఆర్గానిక్ ఫుడ్స్ జోలికి వెళ్లవు.

Turmeric water: ఉదయాన్నే పసుపు నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు!


ఆర్గానిక్ ఫుడ్స్‌లో క్రిమిసంహారకాలు, ప్రిజర్వేటివ్స్ లేని కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సాధారణ ఆహారపదార్థాలతో కూడా అదే స్థాయి ప్రయోజనాలు పొందొచ్చని భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా పెచ్చులతో పాటు తినేటప్పుడు ఆర్గానిక్ కాయగూరలు ఎంచుకుంటే మంచి ఫలితం ఉంటుందట. మిగతా ఆహారాలు సాధారణమైవే తీసుకుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదని భరోసా ఇస్తున్నారు.

ఇక ఆర్గానిక్ ఫుడ్స్ వైపు మళ్లాలనుకుంటున్న వారు ఇండియా ఆర్గానిక్, యూఎస్‌డీఏ, జైవిక్ భారత్ వంటి ధ్రువీకరణ లేబుల్స్ ఉన్న ఉత్పత్తులనే ఎంచుకోవాలి. లేకపోతే నకిలీ ఉత్పత్తుల బారిన పడి మోసపోవాల్సి రావచ్చు. కాబట్టి, అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నాకే ఈ ఫుడ్స్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Latest and Health News

Updated Date - Nov 02 , 2024 | 10:26 AM