Summer: వేసవిలో శరీరాన్ని కూల్ కూల్‌గా ఉంచాలంటే..
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:36 PM
Summer: వేసవి కాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలను శరీరం తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. అలాంటి వేళ.. శరీరం కూల్ కూల్‌గా ఉంచేందుకు టిఫ్స్ ఫాలో అవుతే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వేసవి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తలకిందులవుతోంది. కరోనా వచ్చి వెళ్లిన తర్వాత.. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ విషయం అందరికి తెలిసిందే.వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీంతో డీ హైడ్రేషన్, అలసట, సన్ స్ట్రోక్ తదితర సమస్యలను చుట్టుముడతాయి. అలాంటి వేళ.. శరీరానికి చలువ చేసే ఆహారం, పానీయాలను తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు కీలక సూచినలు చేస్తున్నారు.
నీటి శాతం అధికంగా ఉండే పండ్లు.. పుచ్చకాయ, బత్తాయి, ద్రాక్ష వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. ద్రాక్ష కాయల్లో అధికంగా నీటితోపాటు విటమిన్ సీ ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లను సైతం ఇవి అందిస్తాయి. ఇక బత్తాయి రసం శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచడంలో సహాయ పడుతోంది.
ఇక కూరగాయా విషయానికి వస్తే.. క్యారెట్, టమాటాలోపాటు దోసకాయలు తీసుకోవాలి. వీటిలో నీటి శాతంతోపాటు విటమిన్ సీ సైతం అధికంగా ఉంటుంది. వీటిని సలాడ్‌లగా చేసుకొని తీసుకొంటే.. ఆరోగ్యానికి మంచిది.
పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాల్సి. పెరగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తోంది. అలాగే శరీరాన్ని సైతం చల్లబరస్తోంది. ఇక మజ్జిగలో ఉప్పు, జలకర్ర వేసుకొని తాగడం వల్ల..ఎండ వేడి తీవ్ర వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. ఆ క్రమంలో రోజుకు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరాన్ని కూల్ కూల్‌గా ఉంచుతోంది.
అలాగే కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. వీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతోంది. ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు. దీంతో శరీరం తాజాగా ఉంటుంది.
బార్లీ, రాగి జావా వంటివి శరీరాన్ని చల్లబరుస్తాయి. రాగి జావాలో చిటికెడు పంచదార లేదా ఉప్పు కలిపి తాగితే శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. ఇవి శక్తిని తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు జీర్ణక్రియను సులభం చేస్తాయి.
వేసవి కాలం.. వీటిని తీసుకోక పోవడం ఉత్తమం..
మసాలాలు, నూనెతో చేసిన ఆహారం, మద్యం వంటివి తీసుకోకూడదు. ఎందుకంటే ఆయా ఆహార పదార్థాలు శరీరంలో వేడిని పెంచుతాయి. అందువల్ల వీటిని సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అలాగే వేసవిలో కాటన్ దుస్తులు వాడుతూ.. తేలికగా జీర్ణమయ్యే అహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. వేసవిలో రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని వేడిని దూరం చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
MPs Vs MLAs: ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతాలే టాప్..
TTD Board Decisions: తిరుమలలో ఈ రూల్స్ పాటించాల్సిందే.. టీటీడీ సంచలన నిర్ణయం
Amazon: గుడ్ న్యూస్..ఈ ఛార్జీలను తొలగించిన అమెజాన్..