Share News

Black Tea: బ్లాక్ టీ.. ఇలా తాగితే ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగిపోద్ది..

ABN , Publish Date - Oct 26 , 2024 | 01:31 PM

బ్లాక్ టీని చాలా అరుదుగా తాగుతుంటారు. కానీ ఇది చాలా ఆరోగ్యం. ఒంట్లో కొవ్వు కరగాలంటే ఇలా తాగాలి.

Black Tea: బ్లాక్ టీ.. ఇలా తాగితే ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగిపోద్ది..
Black Tea

భారతీయులకు టీ అనేది ఒక ఎమోషన్. ఇది వరకు కాఫీ లవర్స్ అధికంగా ఉండేవారు. కానీ ఇప్పుడు టీ లవర్స్ ఎక్కువ అయ్యారు. టీకి సుమారు 5000 సంవత్సరాల చరత్ర ఉందట. దీనికి తగ్గట్టే కాలంతో పాటు టీ పౌడి లో కూడా బోలెడు రకాలు వస్తున్నాయి. టీ తాగకపోతే ఏ పని చేయలేని వారు చాలా మంది ఉన్నారు. అయితే పాలు కలపకుండా కేవలం టీ డికాషన్ తాగేవారు చాలా మంది ఉన్నారు. దీన్ని బ్లాక్ టీ పేరుతో పిలుస్తారు. బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదట. బ్లాక్ టీకి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఆదరణ ఉంది. దీన్ని కింద చెప్పుకున్న మార్గాలలో తాగితే ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగిపోతుందని, బరువు తగ్గడంలో చాలా బాగా సహాయపడుతుందని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..

ఈ టిప్స్ పాటిస్తే.. ఇంగ్లీష్ మాట్లాడటం చాలా ఈజీ..


గట్ ఆరోగ్యం..

బ్లాక్ టీ గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బ్లాక్ టీ లో నిర్థిష్టమైన గట్ మైక్రోబయోమ్ ఉంటుంది. జీర్ణక్రియకు, శరీర ఆరోగ్యానికి గట్ మైక్రోబయోమ్ కీలకంగా ఉంటుంది. ఇది పోషకాల శోషణలోనూ, జీవక్రియలోనూ సహాయపడుతుంది. తద్వారా శరీరంలో కొవ్వు కరిగించడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ట్రైగ్లిజరైడ్ స్థాయిలు..

బ్లాక్ టీ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం, శరీరంలో కొవ్వులను తగ్గించడం ద్వారా ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువ ఉంటుంది. బ్లాక్ టీ తీసుకుంటే ఈ ప్రమాదం తగ్గుతుంది.

టీని మళ్లీ వేడి చేస్తున్నారా.. ఆయుర్వేదం చెప్పిన ఈ నిజాలు తెలిస్తే..


కేలరీలు..

పాలతో చేసిన టీలతో పోలిస్తే బ్లాక్ టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు అస్సలు ఉండవు. ప్లెయిన్ బ్లాక్ టీ తీసుకుంటే చాలా ఆరోగ్యం. రుచి కోసం చక్కెర, తేనె వంటివి జోడించుకుంటే కేలరీలు పెరుగుతాయి. బరువు తగ్గే అవకాశాలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నవారు బ్లాక్ టీ తాగడం మంచిది.

ఇవి కూడా చదవండి..

Coconut Oil Vs Ghee: కొబ్బరి నూనె లేదా నెయ్యి.. జుట్టు పెరుగుదలకు ఏది మంచిదంటే..

Weight Loss: ఈ 6 టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. కిలోల కొద్ది బరువు ఈజీగా తగ్గుతారు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 26 , 2024 | 01:31 PM