Grounding: గడ్డి మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఇవీ..!
ABN , Publish Date - Apr 04 , 2024 | 04:45 PM
.అసలు చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవడం నిజంగానే ఆరోగ్యానికి మంచిదా? వైద్యశాస్త్రం దీని గురించి ఏం చెబుతోందంటే..
ఆరోగ్యం కోసం అందరూ వాకింగ్ చేయడం సహజం. సాధారణంగా వాకింగ్ గురించి బోలెడు వివరణలు, మరెన్నో పద్దతులు చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం పచ్చగడ్డి మీద చెప్పుల్లేకుండా నడిస్తే మంచిదని చెప్పడం వినే ఉంటారు. అసలు చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవడం నిజంగానే ఆరోగ్యానికి మంచిదా? దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? వైద్యశాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది తెలుసుకుంటే..
మనస్సు, శరీరానికి కనెక్షన్..
గడ్డిపై చెప్పులు లేకుండా నడవడాన్ని గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అని అంటారు. ఇది శరీరానికి, భూమికి మధ్య అనుబంధాన్ని ఏర్పరిచే గొప్ప మార్గం. ఇందులో భూమి నుండి శరీరానికి ఎలక్ట్రాన్ లను బదిలీచేయడం జరుగుతుంది. ఇది మంటను తగ్గిస్తుంది, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. శరీరంలో సహజంగా విద్యుత్ సమతుల్యతను ప్రోత్సహిస్తుంది.
ఇది కూడా చదవండి: ఫేస్ వాష్ ను రోజులో ఏ సమయంలో, ఎన్ని సార్లు ఉపయోగిస్తే బెస్టో తెలుసా?
ఒత్తిడి..
గడ్డిపైన నడవడం వల్ల మనస్సు, శరీరం పై ఒత్తిడి తగ్గుతుంది. ఇది ప్రశాంతతను చేకూరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గడంలో సహాయపడుతుంది. చెప్పులు లేకుండా భూమి మీద నడిచినప్పుడు ఒకానొక వైబ్రేషన్ పాదాల గుండా శరీరంలోకి ప్రసరించడం అనుభూతి చెందవచ్చు.
శక్తి ప్రవాహం..
శరీరంలో ఉండే వేలాది నరాలు పాదాల అరికాళ్ల వద్ద ముగుస్తాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలలో ఉండే రిఫ్లెక్స్ పాయింట్లు ప్రేరేపించబడతాయి. శరీరం అంతటా మెరుగైన ప్రసరణను, రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది శరీరంలో శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
పాదాల సమస్యలు..
కాళ్లకు చెప్పులు లేకుండా పచ్చ గడ్డి మీద నడవడం వల్ల పాదాలకు ఎనలేని శక్తి లభిస్తుంది. ఇది పాదాలకు సంబధించి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తి..
మట్టిలో ఉండే సూక్ష్మజీవుల ప్రభావం కారణంగా రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అనారోగ్యాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరానికి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు బహిర్గతమవుతాయి. ఇది ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ కు సపోర్ట్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.