Indigestion: అజీర్తి వేధిస్తోందా? ఈ టిప్స్ తో తొందరగా తగ్గించేయచ్చు..!
ABN , Publish Date - Jun 29 , 2024 | 11:59 AM
తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం అజీర్తిలో ప్రధాన సమస్య. దీని వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణక్రియ దెబ్బతినడం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారంలో ఫైబర్, జీర్ణక్రియను ప్రోత్సహించే పదార్థాలు లేకపోవడం వంటివి అజీర్తి రావడానికి కారణాలు అవుతాయి
తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం అజీర్తిలో ప్రధాన సమస్య. దీని వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణక్రియ దెబ్బతినడం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారంలో ఫైబర్, జీర్ణక్రియను ప్రోత్సహించే పదార్థాలు లేకపోవడం వంటివి అజీర్తి రావడానికి కారణాలు అవుతాయి. అజీర్తిని ఇంట్లోనే తొందరగా తగ్గించే కొన్ని టిప్స్ తెలుసుకుంటే..
అల్లం టీ..
అల్లంలో జీర్ణక్రియ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తాజా అల్లం ముక్కలను నీటిలో ఉడకబెట్టాలి. దీన్ని వడగట్టి వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. అజీర్తి తగ్గుతుంది.
Immunity Herbs: ఈ 8 మూలికలు వాడండి చాలు.. వర్షాకాలంలో రోగనిరోధకశక్తి బలపడుతుంది..!
వాము నీరు..
వాము జీర్ణక్రియను ప్రోత్సహించే కార్మినేటివ్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఒక స్పూన్ వాము గింజలను ఒక కప్పు నీటిలో వేసి ఉడికించాలి. తరువాత వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.
సోపు గింజలు..
భోజనం తరువాత ఒక టీ స్పూన్ సోపు గింజలను నమిలి తినాలి. సోపు గింజలు జీర్ణరసాల ఉత్పత్తిని ప్రేరేపంచి అజీర్తి, కడుపు ఉబ్బరం వంటివి తగ్గిస్తాయి.
నిమ్మరసం..
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండి అందులో కొంచెం ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే జీర్ణక్రియ మెరుగై అజీర్తి, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
మజ్జిగ..
మజ్జిగ ప్రోబయోటిక్ పానీయం. ఒక గ్లాసు మజ్జిగలో చిటికెడు వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు కలిపి భోజనం చేసిన తర్వాత తాగాలి. ఇది కడుపుకు మంచి ఉపశమనం ఇస్తుంది.
Yoga: 30రోజులు.. ఈ రెండు యోగాసనాలు వేసి చూడండి.. మీ ఫిట్‌నెస్ ఎంత మెరుగవుతుందంటే..!
అరటిపండ్లు..
అరటిపండ్లు సులభంగా జీర్ణమవుతాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడంలో సహాయపడతాయి. అజీర్తిని, జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది.
పుదీనా..
పుదీనా అజీర్ణం, వికారం నుండి ఉపశమనం కలిగిస్తాయి. పుదీనా టీ చేయడానికి కొన్ని తాజా పుదీనా ఆకులు నమలడం లేదా వేడి నీటిలో ఉడికించి పుదీనా నీటిని తాగడం చేయవచ్చు.
జీలకర్ర నీరు..
ఒక టీ స్పూన్ జీలకర్రను ఒక కప్పు నీటిలో వేసి ఉడికించాలి. ఈ నీటిని వడగట్టి గోరువెచ్చగా తాగాలి. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
అలోవెరా జ్యూస్..
కలబంద జ్యూస్ జీర్ణ సమస్యలను తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను బలపరుస్తుంది. రోజూ ఉదయాన్నే 2 నుండి 3 టేబుల్ స్పూన్ల కలబంద రసాన్ని నీటిలో కలిపి తాగుతుండాలి.
Curd: వర్షాకాలంలో పెరుగు తినేవారికి అలెర్ట్.. ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!
Bronze Massage: అరికాళ్లకు కాంస్య పాత్రతో మసాజ్ చేస్తే ఈ సమస్యలన్నీ మాయం..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.