Health Tips: డెంగ్యూ వచ్చిందా? ఈ పండ్లు తింటే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి..!
ABN , Publish Date - Aug 07 , 2024 | 10:26 PM
Health Tips: సీజన్‌తో పని లేకుండా దోమలు విజృంభించడం.. ఆ దోమల కారణంగా ప్రజలు డెంగ్యూ బారిన పడటం సర్వసాధారణంగా మారింది. అయితే, డెంగ్యూ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలే పోయే పరిస్థితి ఉంటుంది. డెంగ్యూ జ్వరం విషయంలో మనం తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి.
Health Tips: సీజన్‌తో పని లేకుండా దోమలు విజృంభించడం.. ఆ దోమల కారణంగా ప్రజలు డెంగ్యూ బారిన పడటం సర్వసాధారణంగా మారింది. అయితే, డెంగ్యూ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలే పోయే పరిస్థితి ఉంటుంది. డెంగ్యూ జ్వరం విషయంలో మనం తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. డెంగ్యూ నుంచి కోలుకోవడానికి ఆహారంలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అంతకంటే ముఖ్యంగా రోజంతా హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. వాస్తవానికి డెంగ్యూ కారణంగా శరీరంలో బ్లడ్ ప్లేట్‌లెట్స్ పడిపోతాయి. బాధిత వ్యక్తి పూర్తిగా బలహీనపడిపోతారు. వాంతులు, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా మనిషి మొత్తం వీక్ అయిపోతారు.
డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. తద్వారా డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. పడిపోయిన ప్లేట్‌లెట్స్ కూడా పెరగడం ప్రారంభమవుతుంది. మరి డెంగ్యూ బాధితులు ఏ పండ్లు తినాలో ఇక్కడ మనం తెలుసుకుందాం.
కివి
డెంగ్యూ బాధితులు కివి పండ్లను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కివిలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. కవి పండులో డెంగ్యూ రోగులకు దివ్యౌషధంగా నిరూపించే అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. కివిలో ఫైబర్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది సులభంగా జీర్ణం చేస్తుంది. ప్లేట్‌లెట్స్‌ను పెంచడంలో కూడా కివి సహాయపడుతుంది.
దానిమ్మ
డెంగ్యూ రోగులు దానిమ్మ తినాలి. దానిమ్మపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అనేక సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. దానిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దానిమ్మ తినడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. శరీరంలో రక్తం, హిమోగ్లోబిన్‌ను పెంచడానికి దానిమ్మపండు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దానిమ్మపండు తినడం వల్ల అలసట, బలహీనత తగ్గుతుంది.
బొప్పాయి
ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి డెంగ్యూ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఎ బొప్పాయిలో లభిస్తాయి. బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ చికిత్స కోసం ఉపయోగిస్తారు. డెంగ్యూ రోగులు త్వరగా కోలుకోవడానికి బొప్పాయిని తినవచ్చు.
యాపిల్
డెంగ్యూ, మరేదైనా జ్వరం వచ్చినా ఆపిల్ తినొచ్చు. యాపిల్‌లో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి జ్వరం నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. యాపిల్‌లో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది.