Virat Kohli-Matheesha Pathirana: కోహ్లీతో పెట్టుకున్నాడు.. ఇక కెరీర్ ఖతం
ABN , Publish Date - Mar 29 , 2025 | 02:35 PM
Indian Premier League: ఐపీఎల్-2025 రోజురోజుకీ హీటెక్కుతోంది. ఒకదాన్ని మించి మరో ఉత్కంఠ కలిగే మ్యాచ్, ఆటగాళ్ల మధ్య పోరాటాలు క్యాష్ రిచ్ లీగ్‌పై అభిమానుల ఆసక్తిని బాగా పెంచేస్తున్నాయి.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పెట్టుకోవాలనే ధైర్యం ఎవ్వరూ చేయరు. అతడ్ని గెలికితే తమకే ప్రమాదమని అన్ని జట్లకూ తెలుసు. కోహ్లీతో వాదులాటకు దిగినా, అతడ్ని రెచ్చగొట్టినా అపోజిషన్ టీమ్ పని ముగించేస్తాడు. వాళ్ల బౌలర్లను బాదిపారేస్తాడు. చాలా మంది స్టార్ల కెరీర్స్‌ను అతడు క్లోజ్ చేసేశాడు కూడా. అలాంటోడితో ఓ కుర్ర బౌలర్ పెట్టుకున్నాడు. బౌన్సర్ వేసి మరీ కోహ్లీని కవ్వించాడు. అది కాస్తా వెళ్లి కింగ్ హెల్మెట్‌కు బలంగా తాకింది. మరి.. విరాట్ ఊరుకుంటాడా.. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
వాయించి వదలడం ఖాయం
సీఎస్‌కే-ఆర్సీబీ మధ్య చెపాక్ వేదికగా నిన్న ఇంట్రెస్టింగ్ ఫైట్ జరిగింది. ఇందులో 50 పరుగుల తేడాతో బెంగళూరు ఘనవిజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో ఓ మూమెంట్ గురించే ఇప్పుడంతా డిస్కస్ చేస్తున్నారు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా అతడ్ని బౌన్సర్‌తో రెచ్చగొట్టాడు చెన్నై పేసర్ మతీష్ పత్తిరానా. షాట్ మిస్ అవడం, బాల్‌పై సరిగ్గా ఫోకస్ చేయకపోవడంతో అది కాస్తా వెళ్లి విరాట్ హెల్మెట్‌ను బలంగా తాకింది. దీంతో సీరియస్ అయిన కింగ్.. తర్వాతి రెండు బంతులకు 6, 4 బాదేశాడు. మూడో బంతికి సింగిల్ తీసుకున్నాడు. ఇది చూసిన నెటిజన్స్.. పతిరానా కెరీర్ ఇక ఖతం అని.. అతడ్ని కింగ్ వదలడని వార్నింగ్ ఇస్తున్నారు. అతడు ఎప్పుడు ఎదురుపడినా భారీ షాట్లతో తుఫాన్ సృష్టిస్తాడని.. కాచుకో పతిరానా.. కోహ్లీ చేతుల్లో నీకుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నీ కెరీర్ క్లోజ్ చేసేదాకా వదలడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది
ఓటమికి సాకులు వెతుకుతున్న చెన్నై
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి