Doha: తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కిట్‌ల పంపిణీ
ABN , Publish Date - Mar 29 , 2025 | 02:58 PM
జాగృతి ఖతార్ అధ్యక్షురాలు సుధా శ్రీరామోజు, ప్రధాన కార్యదర్శి ప్రవీణలక్ష్మి ముకల ఆధ్వర్యంలో దోహా ఇండస్ట్రియల్ ఏరియాలోని లేబర్ క్యాంప్‌లో 250 మంది కార్మికులకు ఇఫ్తార్ కిట్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దోహా ఇండస్ట్రియల్ ఏరియాలోని లేబర్ క్యాంప్‌లో 250 మంది కార్మికులకు తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కిట్‌లను పంపిణీ జరిగింది.
జాగృతి ఖతార్ అధ్యక్షురాలు సుధా శ్రీరామోజు, ప్రధాన కార్యదర్శి ప్రవీణలక్ష్మి ముకల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కల్చర్ సెంటర్ జనరల్ సెక్రటరీ శ్రీ అబ్రహం జోసెఫ్, ఇంకాస్ ఖతార్ అధ్యక్షుడు హైదర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Also Read: దుబాయిలో ప్రవాసీ కాంగ్రేస్ నేత ఇఫ్తార్ విందు
ఐసీబీఎఫ్, హెడ్ ఆఫ్ లేబర్ శంకర్ గౌడ్ సుందరగిరి, ఐసీసీ హెడ్ ఆఫ్ కల్చర్ నందిని అబ్బగౌని, తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మధు మైదం, ఉపాధ్యక్షుడు గడ్డి రాజు, ప్రధాన కార్యదర్శి వంశీ సాయిగిరి , తెలుగు స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని , జాగృతి ఖతార్ ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యనిర్వాహక సభ్యులు నాగలక్ష్మి పులి, లావణ్య, ఆదర్శ, పద్మిని, ప్రసన్న , రాజేశ్వరి రుద్ర మరియు ఖతార్లో సీనియర్ నాయకులు, వాసవి నాయుడు, రాజ్యలక్ష్మి,
ఎల్లయ్య తాళ్ళపెళ్లి, కృష్ణ శ్రీరామోజు, ఎల్లయ్య మంజూనాధ ఇతరులు పాల్గొన్నారు. రంజాన్ ఉపవాసం, ఆత్మపరిశీలన, భక్తి, త్యాగం, దాతృత్వానికి చిహ్నం అని ఈ సందర్భంగా అతిథులు పేర్కొన్నారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి