Shooting: అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులు.. ఐదుగురు మృతి, నిందితుడు సూసైడ్
ABN , Publish Date - Jun 26 , 2024 | 07:07 AM
అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(shooting) కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా పలుచోట్ల కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికాలోని లాస్ వెగాస్‌లోని రెండు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో కాల్పులు జరుగగా ఐదుగురు చనిపోయారు.
అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(shooting) కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా పలుచోట్ల కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆ క్రమంలో రోడ్లపై, కిరాణా దుకాణాలు సహా పలు చోట్ల కాల్పులు జరుగగా పలువురు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెరికాలోని లాస్ వెగాస్‌లోని రెండు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో ఓ వ్యక్తి మంగళవారం కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఐదుగురితో పాటు 13 ఏళ్ల బాలిక కూడా ఉంది.
నిందితుడిని 57 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్‌గా పోలీసులు(police) గుర్తించారు. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తరువాత నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒకే కాంప్లెక్స్‌లోని రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్లలో అతను మంగళవారం కాల్పులు జరిపాడు. కాల్పులకు గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ఆడమ్స్‌ను ఎప్పుడు, ఎలా అరెస్టు చేశారో కూడా వారు చెప్పలేదు. అయితే మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని పోలీసులు వివరాలను వెల్లడించారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో వరుసగా చోటుచేసుకుంటున్న కాల్పుల ఘటనల పట్ల అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి:
స్పెక్ట్రమ్ వేలంలో తొలిరోజు రూ.11,000 కోట్ల బిడ్లు
T20 World Cup Afghan semis : అఫ్ఘాన్ అద్భుతః
Read Latest International News and Telugu News