Share News

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:15 AM

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

  • నలుగురు మావోయిస్టుల మృతి

  • ఒక జవాన్‌కు తీవ్ర గాయాలు

  • ఘటనా స్థలం నుంచి తుపాకులు స్వాధీనం

  • వరుస ఎన్‌కౌంటర్లతో నక్సల్స్‌కు ఎదురుదెబ్బ

  • గడ్చిరోలి అడవుల్లో ఎన్‌కౌంటర్‌

చర్ల, అక్టోబరు 21: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాన్‌ గాయపడ్డారు. గడ్చిరోలి జిల్లాలోని భామ్రాగఢ్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని కొప్రి అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నట్లు సమాచారం అందడంతో సీ-60 బెటాలియన్‌కు చెందిన బలగాలు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలం నుంచి నక్సలైట్లకు చెందిన తుపాకులు, ఇతర వస్తువులను పోలీస్‌ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు ఇంకా గుర్తించలేదు. మృతదేహాలను గడ్చిరోలి జిల్లా కేంద్రానికి తరలించినట్లు తెలుస్తోంది.

Updated Date - Oct 22 , 2024 | 03:15 AM