Share News

Mumbai: ముంబై వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. కార్లు, ఎస్‌యూవీలకు టోల్ ఛార్జీ లేదు..

ABN , Publish Date - Oct 14 , 2024 | 01:50 PM

ముంబైలోకి ప్రవేశించే లైట్ మోటార్ వెహికల్స్‌కు టోల్‌ను మినహాయిస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (అక్టోబర్ 14) అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. ఈ చట్టం ప్రకారం ముంబైలోకి ప్రవేశించే కార్లు, ఎస్‌యూవీలకు మాత్రమే ఈ టోల్ మినహాయింపు లభిస్తుంది.

Mumbai: ముంబై వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. కార్లు, ఎస్‌యూవీలకు టోల్ ఛార్జీ లేదు..
No toll for cars, SUVs entering Mumbai

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముంబై (Mumbai) వాసులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (CM Eknath Shinde) గుడ్‌న్యూస్ చెప్పారు. ముంబైలోకి ప్రవేశించే లైట్ మోటార్ వెహికల్స్‌కు టోల్‌ను మినహాయిస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (అక్టోబర్ 14) అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రాబోతోంది. ఈ చట్టం ప్రకారం ముంబైలోకి ప్రవేశించే కార్లు (Cars), ఎస్‌యూవీలకు (SUVs) మాత్రమే ఈ టోల్ (No Toll Fees) మినహాయింపు లభిస్తుంది. బస్సులు, లారీలు, ట్రక్కులు వంటి హెవీ వెహికల్స్‌కు మాత్రం ఎలాంటి మినహాయింపూ ఉండదు. ఈ నిర్ణయం ముంబై వాసులకు పెద్ద ఉపశమనం కలిగించబోతోంది (Maharashtra Assembly polls).


ముంబై మహానగరానికి అన్ని వైపులా కలిపి మొత్తం ఐదు టోల్ గేట్స్ ఉన్నాయి. వీటి ద్వారా సిటీలోకి ఎంటర్ అయ్యే కార్లు, ఎస్‌యూవీ వాహనదారులు ఇకపై టోల్ ఫీజ్ కట్టనక్కర్లేదు. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ నిర్ణయం అమలు కాబోతోంది. ముంబై నగరానికి వెళ్లే చుట్టు పక్కల ప్రాంతాల వారికి ఈ నిర్ణయం చాలా ఉపయోగపడనుంది. దీంతో వారంతా సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది.


ఇప్పటికే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో విపక్షాలు పై చేయి సాధించడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని షిండే వర్గం కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్ని ఆకట్టుకునేందుకు మహాయుతి కూటమి రకరకాల ప్లాన్లు వేస్తోంది. కాగా, నవంబర్ 26వ తేదీతో మహారాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వానికి ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాబోతోంది. మహారాష్ట్రలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతున్నట్టు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 14 , 2024 | 01:50 PM