Share News

Bengaluru: రైతును మాల్‌లోకి రానీయని సిబ్బంది

ABN , Publish Date - Jul 17 , 2024 | 05:48 PM

తమది ప్రజా ప్రభుత్వం. తమది రైతు ప్రభుత్వమని గద్దె నెక్కిన నేతలు ఢంకా బజాయించి మరీ ప్రకటనలు గుప్పిస్తుంటారు. అయితే దేశంలో రైతుకు మాత్రం అడుగడుగునా అవమానమే ఎదురవుతుంది.

Bengaluru: రైతును మాల్‌లోకి రానీయని సిబ్బంది

బెంగుళూరు, జులై 17: తమది ప్రజా ప్రభుత్వం. తమది రైతు ప్రభుత్వమని గద్దె నెక్కిన నేతలు ఢంకా బజాయించి మరీ ప్రకటనలు గుప్పిస్తుంటారు. అయితే దేశంలో రైతుకు మాత్రం అడుగడుగునా అవమానమే ఎదురవుతుంది. తాజాగా బెంగుళూరులో ఓ రైతుకు ఘోర అవమానం జరిగింది. స్వతహాగా రైతు అయిన తన తండ్రిని తీసుకొని సినిమా చూసేందుకు జీటీ మాల్‌కు కుమారుడు వెళ్లాడు. అయితే వారిని మాల్‌లోని ప్రవేశించనీయకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

Uttar Pradesh: ఉప ఎన్నికల వేళ.. అగ్రనేతలు కీలక భేటీలు


ఎందుకంటూ వారిని రైతు కుమారుడు ప్రశ్నించాడు. ఆయన పంచె కట్టుకొచ్చారని.. మాల్ యాజమాన్య నిబంధనల మేరకు పంచె ధరించిన వారికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే ఆయన ప్యాంట్ వేసుకొని వస్తే.. మాల్‌లోకి అనుమతిస్తామని తెలిపారు. తాను ఈ దుస్తుల్లోనే ప్రయాణం చేస్తుంటానని.. దుస్తులు మార్చుకొనని రైతు సమాధానం ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రైతు కుమారుడు వీడియో తీసి.. ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అంతేకాదు.. రైతు పట్ల సదరు మాల్ యాజమాన్యం వ్యవహరించిన వైఖరిపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి.

Also Read: Aadhaar number:‘ఆధార్ నెంబర్‌’ తో బ్యాంక్ ఖాతాలో సొమ్ము మాయం


ఈ వీడియోపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా స్పందించారు. పంచె ధరించిన రైతులను దుర్భాషలాడుతున్నారన్నారు. పంచె కట్టుకొస్తే.. మాల్‌లోకి వెళ్లనీయకుండా అడ్డుకొని అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు. ఈ సందర్బంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై షెహజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచె కట్టుకోవడం గర్వకారణమంటారని.. అందుకే కర్ణాటక ముఖ్యమంత్రి పంచె కట్టుకుంటారని ప్రగల్బాలు పలుకుతారని వ్యంగ్యంగా అన్నారు.

Also Read: Maharashtra: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అజిత్‌కి పెద్ద దెబ్బ


మరి రైతులు మాల్‌కు వచ్చేటప్పుడు సూట్ వేసుకొని రావాలా అని ప్రశ్నించారు. దీనిని కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ఎలా చూస్తుందని నిలదీశారు. ఇది రైతులను అవమానించడమేనని షెహజాద్ స్పష్టం చేశారు. ఇంకోవైపు ఈ ఘటనపై రైతు బృందాలు మండిపడ్డాయి. ఆ క్రమంలో బుధవారం బెంగుళూరులోని జీటీ మాల్ ఎదుట రైతు బృందాలు ఆందోళన చేపట్టాయి. రైతలుకు మద్దతుగా పలు కన్నడ సంఘాలు సైతం ఈ ఆందోళనలో పాలుపంచుకున్నాయి.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 17 , 2024 | 06:02 PM