BJP: ఓపీఎస్, దినకరన్‌తో బీజేపీ చర్చలు
ABN , Publish Date - Mar 05 , 2024 | 11:12 AM
నగరంలో సోమవారం ప్రధాని మోదీ పర్యటన బీజేపీ(BJP) శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఆ ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో కూటమి ఏర్పాటు చర్చలు ఆ పార్టీ తీవ్రతరం చేసింది.
చెన్నై: నగరంలో సోమవారం ప్రధాని మోదీ పర్యటన బీజేపీ(BJP) శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఆ ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో కూటమి ఏర్పాటు చర్చలు ఆ పార్టీ తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం, అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌తో కూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపనున్నారు. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని కూటమిలో జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్, ఏసీ షణ్ముగం (పుదియ నీతి కట్చి), పారివేందర్ (ఐజేకే), జాన్‌పాండియన్ నేతృత్వంలో పార్టీ చేరాయి. అదే సమయంలో కూటమిలో చేరేందుకు ఓపీఎస్, దినకరన్ ఉవ్విళ్లూరుతున్నారు. ఓపీఎస్ ఐదు స్థానాలు, దినకరన్ 22 స్థానాలతో కూడిన జాబితా అందజేసి కనీసం 12 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. వారికి అన్ని సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. అందువల్ల ప్రధాని ఇటీవల పాల్గొన్న పల్లడం, నందనం బహిరంగ సభల్లో వీరు పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో, సోమవారం నగర పర్యటన సందర్భంగా మోదీ సూచనలతో మరోసారి ఓపీఎస్, దినకరన్‌తో చర్చలు జరపాలని బీజేపీ రాష్ట్ర నేతలు నిర్ణయించినట్లు తెలిసింది.