Share News

Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. విమానంలో 135 మంది ప్రయాణికులు

ABN , Publish Date - Aug 22 , 2024 | 10:01 AM

ఇటివల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు(Bomb threat) ఎక్కువయ్యాయి. అనేక ప్రాంతాల్లో స్కూల్స్, మాల్స్, ఆస్పత్రులు, విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎయిరిండియా(air india) విమానంలో(flight) బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. తర్వాత ఏమైందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు..  విమానంలో 135 మంది ప్రయాణికులు
Bomb threat to Air India flight

ఇటివల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు(Bomb threat) ఎక్కువయ్యాయి. అనేక ప్రాంతాల్లో స్కూల్స్, మాల్స్, ఆస్పత్రులు, విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎయిరిండియా(air india) విమానంలో(flight) బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను హడావుడిగా విమానం నుంచి దించేశారు. విమానంలో బాంబు ఉందన్న సమాచారం అందిన వెంటనే అధికారులతోపాటు ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది.


అత్యవసర పరిస్థితి

ఈరోజు ముంబై నుంచి తిరువనంతపురం వెళ్తున్న విమానానికి ఈ ముప్పు రావడంతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని అధికారులు ప్రకటించారు. ఉదయం 8 గంటలకు విమానాన్ని విమానాశ్రయంలో ల్యాండ్ చేసి, ఐసోలేషన్ బేకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను విమానం నుంచి బయటకు పంపించినట్లు చెప్పారు. విమానం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకోగానే పైలట్ బాంబు బెదిరింపు గురించి తెలియజేసినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో విమానంలో 135 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.


ముంబై నుంచి

అయితే బెదిరింపు గురించి ఎవరు సమాచారం ఇచ్చారనే దానిపై ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం ప్రకారం ఫ్లైట్ 657 ముంబై నుంచి బయలుదేరింది. ఆ తర్వాత అందులో బాంబు ఉన్నట్లు బెదిరింపు వచ్చింది. అయితే బెదిరింపులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. దీని గురించి విచారణ జరుగుతోంది. విమానాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో దించారు. బాంబు బెదిరింపు రావడంతో పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించామని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు నుంచి తెలిపారు.


మాల్స్‌కు కూడా బెదిరింపులు

ఇటీవల గుజరాత్, పంజాబ్, అస్సాంలోని మూడు మాల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు అనంతరం మాల్‌ను ఖాళీ చేయించి విచారణ చేపట్టారు. పంజాబ్‌లోని మాల్‌లో విచారణలో అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదు. దీని తర్వాత అదే రోజు సూరత్‌లోని మాల్‌ను పేల్చివేస్తామని బెదిరింపు వచ్చింది. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ తర్వాత మాల్‌ను పరిశీలించారు. కానీ ఏం లభించలేదు. అయితే వీటిని ఆకతాయి యువత చేస్తున్నారా లేదా వేరే ఎవరైనా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

PM Modi: శాంతి సందేశంతో యుద్ధభూమికి!

High Court: భర్త వీర్యాన్ని భద్రపరచుకోవచ్చు: హైకోర్టు

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 22 , 2024 | 10:14 AM