YSRCP VS TDP: మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..
ABN , Publish Date - Mar 24 , 2025 | 09:30 PM
YSRCP VS TDP: అనంతపురం జిల్లాల్లో వైసీపీ నేతలు బీభత్సం సృష్టించారు. టీడీపీ నేతపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన మూకలు కూటమి ప్రభుత్వంలోనూ యథేచ్ఛగా దాడులకు తెగబడుతున్నారు.

అనంతపురం జిల్లా: వైసీపీ మూకలు మరోసారి బీభత్సం సృష్టించారు. వైసీపీ హయాంలో చెలరేగిపోయిన వైసీపీ మూకలు కూటమి ప్రభుత్వంలోనూ దాడులకు పాల్పడుతున్నారు. వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. గత వైసీపీ సర్కార్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ చూసుకుని అప్పుడు యథేచ్ఛగా దాడులు చేశారు. టీడీపీ నేతలపై విచక్షణారహితంగా భౌతికదాడులకు దిగారు. తిరిగి వారిపైనే కేసులు పెట్టి వేధించారు. అందుకే రాష్ట్ర ప్రజలు తమ ఓటుతో జగన్ సర్కార్‌ను కూలదోశారు. ప్రభుత్వం మారినా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. కూటమి శ్రేణులపై వరస దాడులు చేస్తూ అదే రీతిలో రెచ్చిపోతున్నారు.
ఇవాళ(సోమవారం) గాండ్లపర్తి కొత్తపల్లి మాజీ సర్పంచ్, తెలుగుదేశం సీనియర్ నేత మోహన్ రెడ్డిపై రుద్రంపేటలో వైసీపీ మూకలు దాడి చేశాయి. ఇంట్లో చొరబడి కత్తులు, రాడ్లతో మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డిపై దాడికి దిగారు. వైసీపీ మూకల దాడిలో మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఓ స్థలం విషయంలో వైసీపీ నేత దివాకర్ రెడ్డి అతని సోదరుడితో కొంతకాలంగా మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డికి వివాదం కొనసాగుతోంది. ఈ విషయంపై సదరు ఫ్యాన్ పార్టీ నేత తమ పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులతో కలిసి వీరంగం సృష్టించాడు. అయితే మోహన్ రెడ్డికి మద్దతుగా టీడీపీ కార్యకర్తలు నిలబడ్డారు. వైసీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిపై పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గాండ్లపర్తి కొత్తపల్లిలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్
High Court Orders: బోరుగడ్డపై పోలీసుల పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Good News: ఏపీ ఉద్యోగులకు పండుగలాంటి వార్త
Read Latest AP News And Telugu News