Share News

Viral Video: మంటల్లో ఇళ్లు.. ఇంట్లోకి పరుగులు తీసిన బాలిక.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Mar 24 , 2025 | 07:07 PM

బాలిక ఇళ్లు మంటల్లో కాలి పోతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత బాలిక పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లింది. పోలీసులతో పాటు అధికారులు కూడా షాక్ అయ్యారు. బాలిక ఎందుకు అలా చేసిందో వారికి అర్థం కాలేదు.

Viral Video: మంటల్లో ఇళ్లు.. ఇంట్లోకి పరుగులు తీసిన బాలిక.. కారణం ఏంటంటే..
viral video

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే నటించిన ‘ఓ శాంతి ఓం’ సినిమాలో ఓ సీన్ ఉంది. హీరోయిన్ శాంతి మంటల్లో చిక్కుకుపోతుంది. అక్కడే ఉన్న హీరో ఓం తన ప్రాణాలకు తెగించి ఆమెను మంటల నుంచి కాపాడతాడు. తన రెండు చేతులతో ఆమెను మంటల నుంచి పక్కకు తీసుకువస్తాడు. ఇలాంటి సీన్లు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలా సినిమాల్లో ఉన్నాయి. కానీ, నిజ జీవితంలో మాత్రం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన మాత్రం వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ లాంటిది. ఓ బాలిక ఇళ్లు మంటల్లో కాలిపోతూ ఉంది. ఇలాంటి టైంలో ఆ యువతి మంటల్లో కాలుతున్న ఇంట్లోకి పరుగులు తీసింది.


ఇంతకీ ఆ బాలిక ఇంట్లోకి ఎందుకు పరుగులు తీసింది?.. ప్రాణాలకు తెగించి మరీ అలా చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? అని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌ జిల్లాలోని ఆరై గ్రామానికి చెందిన పూరి గుడిసెలను ప్రభుత్వం కూల్చేస్తూ ఉంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఆ గుడిసెలు కట్టారంటూ అధికారులు వాటిని తొలగిస్తున్నారు. ఇలాంటి టైంలో ఆ గుడిసెలకు నిప్పు అంటుకుంది. కొద్ది సేపటి తర్వాత ఓ బాలిక మంటల్లో కాలుతున్న తన ఇంట్లోకి పరిగెత్తింది. అది చూసి పోలీసులతో పాటు అధికారులు కూడా షాక్ అయ్యారు. బాలిక ఏం చేస్తుందో తెలీక.. ఇంటి తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉన్నారు. లోపలికి వెళ్లిన బాలిక తన పుస్తకాల సంచితో బయటకు పరుగులు పెడుతూ వచ్చింది.


ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సాధారణ జనంతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు సైతం స్పందిస్తున్నారు. సమాజ్ వాది పార్టీ ప్రెసిడెంట్ అఖిలేష్ యాదవ్ అధికారుల తీరుపై మండిపడ్డాడు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇక, స్థానిక ఎస్పీ లీడర్లు ఆ బాలికను బాగా చదివించడానికి ముందుకు వచ్చారు. బాలికను మంచి స్కూల్లో చేర్పిస్తామని, చదువులకు అయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని అన్నారు. సోషల్ మీడియాలో సైతం బాలికకు చదువు పట్ల ఉన్న శ్రద్ధకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

MS Dhoni: ధోని ఏ భాషకు ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు..హిందీ, ఇంగ్లీష్, తమిళ్ మాత్రం కాదు..

Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Updated Date - Mar 24 , 2025 | 07:38 PM