Share News

BJP President: అధ్యక్షుడిని బీజేపీ ఎలా ఎంపిక చేస్తుంది.. పూర్తి వివరాలు..

ABN , Publish Date - Mar 24 , 2025 | 08:31 PM

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంతో పాటు జాతీయ అధ్యక్షుడి ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేసింది. కొత్త జాతీయ అధ్యక్షుడిని అతి త్వరలో ఎన్నుకోనుంది.

BJP President: అధ్యక్షుడిని బీజేపీ ఎలా ఎంపిక చేస్తుంది.. పూర్తి వివరాలు..
BJP

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకానికి సర్వం సిద్ధం అయింది. బీసీ సామాజికవర్గానికి చెందిన ఎంపీకి గానీ, సైద్ధాంతిక నేపథ్యం ఉన్న నేతకు గానీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. ఉగాది పండుగలోపే నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాంచందర్‌రావు‌‌కు పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ సమీకరణాలు మారితే.. బీసీ ఎంపీకి పగ్గాలు వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇదంతా రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించింది. ఇక, బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కూడా అధిష్టానం కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ మేరకు సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి.


అధ్యక్షుడి ఎంపిక ఇలా..

రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షుల ఎంపిక పూర్తయిన తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది. అది కూడా సగానికి పైగా రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ మొదలవుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆమోదంతో ఏకగ్రీవంగా అధ్యక్షుడ్ని ఎంపిక చేస్తారు. పార్టీలో చేరి 15 సంవత్సరాలుగా సేవ చేస్తున్న వారికే అధ్యక్షుడిగా అవకాశం ఉంటుంది. జాతీయ, రాష్ట్ర మండలి నుంచి ఎంపిక చేయబడిన సభ్యులతో ఏర్పడ్డ ఎలక్టోరల్ కాలేజీ ద్వారా పార్టీ అధ్యక్షుడిని నామమాత్రంగా ఎన్నుకుంటారు. తుది నిర్ణయం మాత్రం పార్టీ సీనియర్ లీడర్లు మాత్రమే తీసుకుంటారు. జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక అయిన వారు మూడు సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు. అది కూడా రెండు దఫాలు మాత్రమే పార్టీ అధ్యక్షుడిగా పని చేయడానికి అవకాశం కల్పిస్తారు.


ఇప్పటి వరకు బీజేపీ జాతీయాధ్యక్షులు

పార్టీ మొదలైన నాటినుంచి ఇప్పటి వరకు 11 మంది జాతీయ అధ్యక్షులుగా పని చేశారు. వీరిలో రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాలు రెండు దఫాలు అధ్యక్షుడిగా పని చేశారు. జేపీ నడ్డా 2020లో ఎన్నికయ్యారు. 2023 నాటికి పదవీకాలం పూర్తవుతుంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు.

1) అటల్ బిహారీ వాజ్‌పేయ్ ( 1980 నుంచి 1986 వరకు)

2) లాల్ క్రిష్ణ అద్వానీ ( 1986-1990, 1993-1998, 2004-2005 )

3) మురళీ మనోహర్ జోషీ ( 1991-1993 )

4) కుశభవ్ ధాక్రే ( 1998-2000 )

5) బంగారు లక్ష్మణ్ ( 2000-2001 )

6) కే జనా క్రిష్ణమూర్తి ( 2001-2002 )

7) వెంకయ్య నాయుడు ( 2002-2004 )

8) రాజ్‌నాథ్ సింగ్ ( 2005-2009, 2013-2014 )

9) నితిన్ గడ్కారీ ( 2010-2013 )

10) అమిత్ షా ( 2014-2017, 2017-2020)

11) జేపీ నడ్డా ( 2020- ప్రస్తుతం)


ఇవి కూడా చదవండి:

ప్రపంచంలోనే అతి పెద్ద లగ్జరీ బోట్

Nagpur Violence: అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చివేతలపై ముంబై హైకోర్టు స్టే... ఏకపక్ష నిర్ణయంపై ఆగ్రహం

Minister Satyakumar: అందుకే డీలిమిటేషన్‌‌ను తెరపైకి తెచ్చారు.. డీఎంకేపై మంత్రి సత్యకుమార్ యాదవ్ విసుర్లు

BSNL 5G Services: దేశంలో BSNL 5G అమలుపై..కేంద్ర మంత్రి కీలక ప్రకటన

Updated Date - Mar 24 , 2025 | 08:46 PM