Share News

AP GOVT: అమరావతిలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.

ABN , Publish Date - Mar 24 , 2025 | 10:12 PM

AP GOVT: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే జార్జియ నేషనల్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది.

AP GOVT: అమరావతిలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ.
International University Amaravati

అమరావతి: ఏపీలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో అమరావతిలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియ నేషనల్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. మంత్రి నారా లోకేష్ సమక్ష్యంలో జార్జియ నేషనల్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో సోమవారం నాడు జరిగిన కార్యక్రమంలో జీఎన్‌యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంవోయూపై సంతకం చేశారు.


ఒప్పదం ప్రకారం అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్‌యూ సుమారుగా రూ. 1. 300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నదని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ ఒప్పదంతో 500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని తెలిపారు. జీఎన్‌యూతో ఒప్పదంతో ఏపీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడంతో పాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచ పటంలో నిలపడానికి దోహదపడుతుందని అన్నారు. ఏపీలో విద్య ప్రమాణాలను పెంచడమేగాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమన నైపుణ్యాలు అందుతాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

TDP MP: విడదల రజినికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్

High Court Orders: బోరుగడ్డపై పోలీసుల పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

Good News: ఏపీ ఉద్యోగులకు పండుగలాంటి వార్త

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 10:14 PM