Share News

Pankaj Chaudhary: పార్లమెంట్ సాక్షిగా తెలుగు రాష్ట్రాల అప్పులు ప్రకటించిన కేంద్రం

ABN , Publish Date - Mar 24 , 2025 | 09:56 PM

Pankaj Chaudhary: తెలుగు రాష్ట్రాల అప్పులు ఎంత ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రం అప్పులతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే కేంద్రం ఎంత అప్పు చేసింది. తదితర విషయాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంజక్ చౌదరి పార్లమెంట్ సాక్షిగా గణాంకాలతో సహా సోదాహరణగా వివరించారు.

Pankaj Chaudhary: పార్లమెంట్ సాక్షిగా తెలుగు రాష్ట్రాల అప్పులు ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 24: గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో అప్పులు మరింత అధికమయ్యాయంటూ ప్రతిపక్షాలతోపాటు వామపక్ష పార్టీల నేతలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలపై వరుస విమర్శలు గుప్పిస్తోంటారు. అలాంటి వేళ.. కేంద్రంతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు చేసిన అప్పులు.. వాటి వివరాలతోపాటు దేశంలో అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాను కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది.

సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 2025, మార్చి 30 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 5, 62, 557 కోట్లు కాగా.. తెలంగాణ రాష్ట్రంపై రూ.4, 42, 298 కోట్ల భారం ఉందని స్పష్టం చేశారు. ఏపీ అప్పులో స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) 34.7 శాతంగా ఉండగా.. తెలంగాణ అప్పులో జీఎస్‌డీపీ 26. 2శాతంగా నమోదు అయిందని చెప్పారు.


అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా తమిళనాడు అప్పు రూ.9,55,691 కోట్లుతో ఆగ్రస్థానంలో ఉందని కేంద్ర మంత్రి పంజక్ చౌదరి వెల్లడించారు. ఆ తర్వాత వరుస స్థానాల్లో రూ. 8, 57, 844 కోట్లతో ఉత్తరప్రదేశ్, రూ.8,12, 068 కోట్లతో మహారాష్ట్ర, రూ.7, 25, 456 కోట్లతో కర్ణాటక, రూ.7,14,196 కోట్లతో పశ్చిమబెంగాల్‌ ఉన్నాయని పేర్కొన్నారు.


అయితే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం.. 2025, మార్చి 31వ తేదీ నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి అప్పు రూ. 2, 67, 35, 462 కోట్లు ఉంటుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సోదాహరణతో వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For National News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 10:13 PM