Share News

Nagpur Violence: అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చివేతలపై ముంబై హైకోర్టు స్టే... ఏకపక్ష నిర్ణయంపై ఆగ్రహం

ABN , Publish Date - Mar 24 , 2025 | 08:24 PM

సోమవారం మధ్యాహ్నం కోర్టు ఆదేశాలు వెలువడే సరికే అల్లర్ల కేసులో కీలక నిందితుడైన ఫాహిమ్ ఖాన్ రెండతస్తుల భవనాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. మరో నిందితుడు యూసఫ్ షేక్ అక్రమ కట్టడాల కూల్చివేతను మాత్రం కోర్టు ఆదేశాలతో అధికారులు నిలిపివేశారు.

Nagpur Violence: అల్లర్ల నిందితుల ఇళ్లు కూల్చివేతలపై ముంబై హైకోర్టు స్టే... ఏకపక్ష నిర్ణయంపై ఆగ్రహం

నాగపూర్: నాగపూర్ హింసాకాండ (Nagpur Violence)లో ఇద్దరు నిందితుల నివాసాలపై మున్సిపల్ అధికారులు బుల్డోజర్ యాక్షన్‌కు దిగడంపై ముంబై హైకోర్టు (Mumbai High Court) నాగపూర్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కట్టడాల కూల్చివేత పనులను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టింది. సోమవారం మధ్యాహ్నం కోర్టు ఆదేశాలు వెలువడే సరికే అల్లర్ల కేసులో కీలక నిందితుడైన ఫాహిమ్ ఖాన్ రెండతస్తుల భవనాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. మరో నిందితుడు యూసఫ్ షేక్ అక్రమ కట్టడాల కూల్చివేతను మాత్రం కోర్టు ఆదేశాలతో అధికారులు నిలిపివేశారు.

Nagpur Riots Latest Update: నాగ్‌పూర్ అల్లర్లలో నిందితుడిపై మహా సర్కార్ రియాక్షన్ ఇదీ..


ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా షాహిమ్ ఖాన్, యూసఫ్ షేక్ తరఫు న్యాయవాదులు సోమవారంనాడు కోర్టును ఆశ్రయించారు. వెంటనే విచారణ జరపాలని కోర్టును కోరారు. దీంతో జస్టిస్ నితిన్ సాంబ్రే, వృషాలి జోషితో కూడిన డివిజన్ బెంచ్ తక్షణ విచారణ చేపట్టింది. అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేతలకు ముందే ఇంటి యజమానుల విచారణకు ఎందుకు అవకాశం ఇవ్వకూడదని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఆస్తి యజమానులను విచారించేందుకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఒకవేళ కూల్చివేతలు చట్టవిరుద్ధంగా జరిగినట్టు తేలితే జరిగిన నష్టానికి పరిహారం అధికారులు చెల్చించాల్సి వస్తుందని పేర్కొంది. దీనిపై ప్రభుత్వం స్పందనను తెలియజేయాలని బెంచ్ ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది.


కాగా, మార్చి 17వ తేదీన చెలరేగిన హింసాకాండకు కేంద్ర స్థానంగా భావిస్తున్న యూసుఫ్ షేక్ ఇంట్లోని అక్రమ కట్టడాలను భారీ పోలీసు భద్రత మధ్య మున్సిపల్ యంత్రాంగం సోమవారం ఉదయం బుల్డోజర్లతో కూల్చివేసింది. అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే ఖాన్‌కు నోటీసులు ఇచ్చినట్టు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.


ఘటన పూర్వాపరాలు..

ఛత్రపతి శంభాజీనగర్‌లో ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూపరిషత్ నేతృత్వంలో ఈనెల 17న నిరసన జరిగింది. అయితే ఈ నిరసనల్లో మతపరమైన శాసనాలు ఉన్న చాదర్ దహనమైందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించడంతో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు దహనానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు సహా మొత్తం 33 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. సోషల్ మీడియాలో వదంతులకు కారణమైన షాహిమ్‌ ఖాన్ సహా ఆరుగురిపై దేశద్రోహం కేసు నమోదు అయ్యింది.


ఇవి కూడా చదవండి..

Devendra Fadnavis: క్షమాపణ చెప్పాలి.. కునాల్ కమ్రా వ్యాఖ్యలపై ఫడ్నవిస్ ఆగ్రహం

Kunal Kamra Controversy: హాబిటాట్ క్లబ్‌ ఆక్రమణల తొలగింపు.. రంగంలోకి దిగిన బీఎంసీ

Rajya Sabha : ముస్లిం రిజర్వేషన్ల అంశంపై రాజ్యసభలో రభస

Read Latest and National News

Updated Date - Mar 24 , 2025 | 08:31 PM