Share News

Cash Row: జస్టిస్ వర్మ బదిలీపై అలహాబాద్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ అభ్యంతరం

ABN , Publish Date - Mar 24 , 2025 | 09:52 PM

జస్టిస్ వర్మ తిరిగి ప్రజావిశ్వాసం పొందాలంటే మొత్తం వ్యవహారంపై స్ర్కూటినీ జరగాలని, ఆయనపై తక్షణం ఎఫ్ఐఆర్ నమోదుకు, సిబీఐ, ఈడీ, ఇతర ఏజెన్సీలతో దర్యాప్తునకు సీజేఐ అనుమతించాలని అలహాబాద్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

Cash Row: జస్టిస్ వర్మ బదిలీపై అలహాబాద్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ అభ్యంతరం

న్యూఢిల్లీ: ఇంట్లో నోట్లకట్టల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ (Yashwant Verma) వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. అలహాబాద్ హైకోర్టుకు అయనను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న తాజా నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. జస్టిస్ వర్మ తిరిగి ప్రజావిశ్వాసం పొందాలంటే మొత్తం వ్యవహారంపై స్ర్కూటినీ జరగాలని, ఆయనపై తక్షణం ఎఫ్ఐఆర్ నమోదుకు, సిబీఐ, ఈడీ, ఇతర ఏజెన్సీలతో దర్యాప్తునకు సీజేఐ అనుమతించాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. జస్టిస్ వర్మపై అభిశంసన ప్రొసీడింగ్స్ ప్రారంభించేలా ప్రభుత్వానికి సీజేఐ సిఫారసు చేయాలని కూడా కోరింది. అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ వర్మ బదిలీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మార్చి 25న నిరవధిక నిరహార దీక్షకు దిగుతామని తెలిపింది.

Supreme Court Collegium: జస్టిస్ యశ్వంత్‌వర్మ తిరిగి అలహాబాద్ హైకోర్టుకు.. సుప్రీం కొలీజియం సిఫారసు


అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ మీడియాతో మాట్లాడుతూ, అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్, ఇతర ఏ హైకోర్టులకు జస్టిస్ వర్మను బదిలీ చేసినా తమకు సమ్మతం కాదని, ఈమేరకు తమ అసోసియేషన్ తీర్మానం చేసిందని తెలిపారు. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు జస్టిస్ వర్మ తన హయాంలో ఇచ్చిన తీర్పులన్నింటినీ సమీక్షించాలని అన్నారు. సుప్రీంకోర్టు దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని, న్యాయవ్యవస్థకు తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. జస్టిస్ వర్మపై అభిశంసన చర్యలు ప్రారంభించాల్సిందిగా కేంద్రానికి సీజేఐ సిఫారసు చేయాలని బార్ అసోసియేషన్ కోరుతున్నట్టు చెప్పారు.


కాగా, జస్టిస్ వర్మను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ సోమవారం ఉదయం కీలక ప్రకటన చేసింది. ఆ క్రమంలోనే ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆ కొద్ది గంటలకే అలహాబాద్ హైకోర్టుతో సహా దేశంలో ఎక్కడికి జస్టిస్ వర్మను బదిలీ చేసినా తమకు సమ్మతం కాదంటూ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేయడం మరింత కీలకంగా మారింది.


ఇవి కూడా చదవండి..

Devendra Fadnavis: క్షమాపణ చెప్పాలి.. కునాల్ కమ్రా వ్యాఖ్యలపై ఫడ్నవిస్ ఆగ్రహం

Kunal Kamra Controversy: హాబిటాట్ క్లబ్‌ ఆక్రమణల తొలగింపు.. రంగంలోకి దిగిన బీఎంసీ

Rajya Sabha : ముస్లిం రిజర్వేషన్ల అంశంపై రాజ్యసభలో రభస

Read Latest and National News

Updated Date - Mar 24 , 2025 | 09:55 PM