Share News

CM Chandrababu Naidu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. సీతారాం ఏచూరికి నివాళి అర్పించిన సీఎం

ABN , Publish Date - Sep 13 , 2024 | 09:15 PM

సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా సీతారాం ఏచూరి నివాసానికి బయలుదేరారు.

CM Chandrababu Naidu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు.. సీతారాం ఏచూరికి నివాళి అర్పించిన సీఎం

ఢిల్లీ: సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే ఆయనకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా సీతారాం ఏచూరి నివాసానికి బయలుదేరారు. ఏచూరి పార్ధివదేహానికి సీఎంతోపాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు,అప్పల నాయుడు, కృష్ణ ప్రసాద్,మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, రవీంద్ర కుమార్ శ్రద్ధాంజలి ఘటించారు.

జేఎన్‌యూలో..

ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి సీతారాం ఏచూరి మృతదేహాన్ని ఇవాళ సాయంత్రం జేఎన్‌యూకు తీసుకువెళ్లారు. అక్కడ ఏచూరి భౌతికకాయానికి అధ్యాపకులు, విద్యార్థులు నివాళి అర్పించారు. లాల్ సలాం అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమాన కమ్యూనిస్టు యోధుడికి పుష్పాంజలి ఘటించారు. జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య, సీపీఎం అగ్రనేతలు బృందా కారాట్, ఎంఏ బేబీ, అశోక్ ధాల్వే, విజయ రాఘవన్, రాజ్యసభ ఎంపీ వాసుదేవన్ తదితరులు నివాళి అర్పించారు.


అనంతరం వసంత్ కుంజ్‌లోని ఏచూరి నివాసానికి తరలించారు. రేపు ఉదయం 8గం.లకు ఏచూరి పార్దీవదేహాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తరలించనున్నారు. ఉదయం 10గం.ల వరకు పార్టీ అగ్రనేతలు, విదేశీ ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తదితరుల సందర్శనార్ధం, ఉదయం 11గం.ల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తల కోసం అక్కడే ఉంచుతారు. సాయంత్రం 4 గం.లకు భౌతికకాయాన్ని ఏకేజీ భవన్ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తారు.

For Latest News and National News click here

Updated Date - Sep 13 , 2024 | 09:56 PM