Share News

Karnataka: రోజుకు 5 వేలు ఇస్తేనే కాపురం చేస్తుందట!

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:01 AM

ఆత్యహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని, ఉద్యోగం చేసుకోనివ్వకుండా వేధిస్తోందని, విడాకులు ఇవ్వాలంటే రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోందని ఆయన ఆరోపించారు. పిల్లలను కనేందుకు తిరస్కరిస్తోందని, 60 ఏళ్ల వయస్సులో దత్తత తీసుకుందామని చెబుతోందని పేర్కొన్నారు.

 Karnataka: రోజుకు 5 వేలు ఇస్తేనే కాపురం చేస్తుందట!

కర్ణాటకలో బెంగళూరు టెకీ ఫిర్యాదు

బెంగళూరు, మార్చి 20: రోజుకు రూ.5వేలు ఇస్తేనే తన భార్య కాపురం చేస్తానని అంటోందని కర్ణాటకకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శ్రీకాంత్‌ బెంగళూరులోని వ్యాలికావల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆత్యహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని, ఉద్యోగం చేసుకోనివ్వకుండా వేధిస్తోందని, విడాకులు ఇవ్వాలంటే రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోందని ఆయన ఆరోపించారు. పిల్లలను కనేందుకు తిరస్కరిస్తోందని, 60 ఏళ్ల వయస్సులో దత్తత తీసుకుందామని చెబుతోందని పేర్కొన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ చేస్తున్న సమయంలో పెద్దగా మ్యూజిక్‌ ప్లే చేస్తూ, డ్యాన్స్‌ చేస్తూ గందరగోళం సృష్టిస్తుందని, దీని వలన తన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పోయిందని, ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేకపోయానని పేర్కొన్నారు. శ్రీకాంత్‌ 2022లో పెద్దలు నిర్ణయించిన వివాహం చేసుకున్నారు. అయితే శ్రీకాంత్‌ ఆరోపణలను ఆయన భార్య బిందు ఖండించారు. విడాకుల కోసం డబ్బులు డిమాండ్‌ చేయలేదన్నారు. తమ వివాహానికి తన తండ్రి రూ.40 లక్షలు ఖర్చు చేశారని, ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని మాత్రమే కోరానని చెప్పారు. శ్రీకాంతే తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని, వరకట్నం వేధింపులకు గురిచేశాడని ప్రత్యారోపణలు చేశారు.


ఇవి కూడా చదవండి..

Shocking Video: నాదే తప్పు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. బస్సు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే నివ్వెరపోవడం ఖాయం..

Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..

Updated Date - Mar 21 , 2025 | 05:01 AM