Bihar Shooting: నల్లా నీళ్ల దగ్గర గొడవ.. అన్నను కాల్చేసిన తమ్ముడు
ABN , Publish Date - Mar 21 , 2025 | 05:05 AM
బిహార్ భాగల్పూర్‌లోని జగత్‌పూర్ గ్రామంలో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంటికి వచ్చే నల్లా నీళ్లు పట్టుకునే విషయంలో వాళ్ల భార్యలిద్దరు గురువారం ఉదయం గొడవపడ్డారు. ‘‘నల్లా మాదంటే.. మాది’’ అని వాదులాడుకున్నారు. గొడవ పెద్దదైంది. విశ్వజిత్, జయజిత్‌లు కలుగజేసుకొన్నారు.

ఇద్దరూ కేంద్రమంత్రి నిత్యానంద్ మేనల్లుళ్లు
న్యూఢిల్లీ, మార్చి 20: విశ్వజిత్, జయజిత్ ఇద్దరూ అన్నదమ్ములు. కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్‌కు మేనల్లుళ్లు. ఆయన సోదరి హీనాదేవి కుమారులు. బిహార్ భాగల్పూర్‌లోని జగత్‌పూర్ గ్రామంలో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంటికి వచ్చే నల్లా నీళ్లు పట్టుకునే విషయంలో వాళ్ల భార్యలిద్దరు గురువారం ఉదయం గొడవపడ్డారు. ‘‘నల్లా మాదంటే.. మాది’’ అని వాదులాడుకున్నారు. గొడవ పెద్దదైంది. విశ్వజిత్, జయజిత్‌లు కలుగజేసుకొన్నారు. గొడవ ఇంకా ముదిరింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఆవేశంలో విశ్వజిత్ తన తమ్ముడు జయజిత్‌పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయంతో రక్తమోడుతున్న జయజిత్ అదే తుపాకీని లాక్కొని అన్న విశ్వజిత్‌పై కాల్పులు జరిపాడు. ఇద్దరు కుమారులను ఆపడానికి తల్లి హీనాదేవి ప్రయత్నించగా.. ఆమెకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే విశ్వజిత్ చనిపోయాడు. జయజిత్ పరిస్థితి విషమంగా మారింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..