Share News

Congress: ‘గాలి’ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి..

ABN , Publish Date - Mar 29 , 2024 | 11:35 AM

కళ్యాణకర్ణాటక ప్రగతి పక్షను బీజేపీలో విలీనం చేసిన గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి(Gangavati MLA Gali Janardhana Reddy) సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రమేష్ బాబు డిమాండ్‌ చేశారు.

Congress: ‘గాలి’ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి..

- కాంగ్రెస్ నేత రమేష్‏బాబు డిమాండ్‌

బెంగళూరు: కళ్యాణకర్ణాటక ప్రగతి పక్షను బీజేపీలో విలీనం చేసిన గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి(Gangavati MLA Gali Janardhana Reddy) సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రమేష్ బాబు డిమాండ్‌ చేశారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంటనే గాలి జనార్ధనరెడ్డికి షోకాజ్‌ నోటీసు జారీ చేయాలన్నారు. రాజ్యాంగం 10 షెడ్యూలు ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ యూటీ ఖాదర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. కళ్యాణకర్ణాటక ప్రగతి పక్షను బీజేపీలో విలీనం చేయడం పార్టీ నిషేధ చట్టం ప్రకారం సరికాదన్నారు. ఒక పార్టీ మరో పార్టీలో విలీనం చేసేందుకు పలు నిబంధనలు ఉన్నాయన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన నివేదిక ప్రకారం కళ్యాణకర్ణాటక ప్రగతి పక్షకు అధ్యక్షులు రామణ్ణ కాగా అనేక మంది పధాధికారులు ఉన్నారన్నారు. పార్టీ 2023 మార్చి 30న ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన నివేదికకు సమర్పించిన ఆడిట్‌ నివేదిక ప్ర కారం పార్టీలో కేవలం రూ.1320లు మాత్రమే చూపారన్నారు. జనార్ధనరెడ్డి గనుల అక్రమాల ద్వారా సంపాదించిన అక్రమాస్తులతో పార్టీని స్థాపించి ప్రస్తుతం బీజేపీలో విలీనం చేశారన్నారు. గాలి జనార్ధనరెడ్డి బీజేపీలో చేరిన విషయం జాతీయ స్థాయిలో చర్చకు కారణమైందన్నారు. బీజేపీ అవినీతి పరులను, ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని పార్టీలో చేర్చుకుంటుందన్నారు. ఎన్ని కేసులు, ఆవినీతి ఆరోపణలు ఉన్నా బీజేపీలో చేరితే ఒక్కసారిగా వాషింగ్‌ మిషన్‌లో శుభ్రం చేసినట్లు అవుతారా అంటూ ప్రశ్నించారు. బీజేపీలో చేర్చుకోవడం ద్వారా అవినీతి మసి పూసుకుందన్నారు. బీజేపీ అంటే బాండ్‌ జనతా పార్టీ అన్నారు.

pandu4.2.jpg

Updated Date - Mar 29 , 2024 | 11:41 AM