పోలీసును చూసి గుక్కపెట్టిన ఏడ్చిన వధువు.. ట్విస్ట్ మామూలుగా ఉండదు..
ABN , Publish Date - Apr 04 , 2025 | 05:08 PM
Bride And RPF Police News: పెళ్లి బట్టల్లో ఉన్న బాలికను చూడగానే అతడికి అనుమానం వచ్చింది. వెంటనే 181కు ఫోన్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత రైల్వే పోలీసులు అక్కడికి వచ్చారు. వారిని చూడగానే బాలిక గుక్క పెట్టి ఏడవటం మొదలెట్టింది.

అహ్మదాబాద్: 16 ఏళ్ల బాలిక రైల్వే స్టేషన్‌లో నిల్చుని ఉంది. ఆమె పెళ్లి బట్టల్లో ఉంది. కొద్దిసేపటి తర్వాత కొందరు రైల్వే పోలీసు అక్కడికి వచ్చారు. ఆ పోలీసులను చూడగానే ఆ బాలిక గుక్కపట్టి ఏడవటం మొదలెట్టింది. ఆ అమ్మాయి ఎందుకు అలా ఏడుస్తోందో అర్థం కాలేదు. దగ్గరకు వెళ్లి.. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఆమె జరిగిన సంగతి చెప్పింది. ఆమె చెప్పింది విని ఆ రైల్వే పోలీస్ షాక్ అయ్యారు. ఇంతకీ బాలిక ఎందుకు ఏడ్చింది? ఆ పోలీసులకు ఏం చెప్పింది?.. ఆ వివరాల్లోకి వెళితే.. బిహార్‌కు చెందిన 16 ఏళ్ల బాలికకు కొన్ని నెలల క్రితం పెళ్లి నిశ్చయం అయింది. ఈ పెళ్లి చేసుకోవటం ఆమెకు ఏ మాత్రం ఇష్టం లేదు.
చదువుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు వినలేదు. బలవంతంగా పెళ్లి చేయడానికి పూనుకున్నారు. దీంతో ఆ బాలిక తన మేనమామకు ఫోన్ చేసింది. పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. అతడు పెళ్లి ఆపడానికి ప్రయత్నించాడు. అయినా అమ్మాయి తల్లిదండ్రులు వినలేదు. పెళ్లికి అంతా సిద్ధం అయిపోయింది. పెళ్లి రోజు రానే వచ్చింది. పాపం.. బాలిక మాత్రం ఏడుస్తూ కూర్చుంది. అయినా వాళ్లు వినలేదు. బలవంతంగా పెళ్లికి సిద్దం చేశారు. బాలిక చివరగా మరోసారి తల్లిదండ్రుల్ని బతిమాలింది. అయినా వాళ్లు వినలేదు. దీంతో ఇంట్లో వాళ్లకు చెప్పకుండా అక్కడినుంచి వచ్చేసింది.
పెళ్లి బట్టలతో బీహార్‌లో ట్రైన్ ఎక్కి అహ్మదాబాద్‌కు వచ్చేసింది. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగాలుగా ఉన్న ఆ అమ్మాయిని ఎన్జీఓకు చెందిన ఓ వ్యక్తి చూశాడు. అతడికి ఏదో అనుమానం వచ్చి..అభయం 181 ఉమెన్స్ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత రైల్వే పోలీసులు అక్కడికి వచ్చారు. రైల్వే పోలీసులను చూడగానే ఆ బాలిక ఏడవటం మొదలెట్టింది. వాళ్లు ఎంక్వైరీ చేయగా అసలు విషయం బయటపెట్టింది. వాళ్లు ఆమెను ప్రభుత్వ గృహానికి పంపించారు. బాలిక మామకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అతడు అమ్మాయి దగ్గరకు వచ్చాడు. బాలికకు పెళ్లి చేయకుండా చూస్తానని, చదువుకునే అవకాశం కూడా కల్పిస్తానని భరోసా ఇచ్చాడు. బాలికను అక్కడినుంచి తీసుకెళ్లాడు.
ఇవి కూడా చదవండి:
Vijaya Dairy Price Revision: పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ డెయిరీ..
Polavaram Project: ఎస్‌బీఐని కాదని ప్రైవేటుకు