Share News

Gurugram Blast: గురుగ్రామ్‌లో బాంబు పేలుడు.. సంచలన ప్రకటన చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..

ABN , Publish Date - Dec 12 , 2024 | 03:47 PM

గురుగ్రామ్ సెక్టార్ 29లోని ఓ బార్ వెలుపల మంగళవారం నాటు బాంబు పేలింది. ఆ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సచిన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మరో రెండు నాటు బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Gurugram Blast: గురుగ్రామ్‌లో బాంబు పేలుడు.. సంచలన ప్రకటన చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..
Lawrence Bishnoi

హర్యానాలోని గురుగ్రామ్‌ (Gurugram)లో ఇటీవల సంభవించిన బాంబు పేలుడుకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ సంచలన ప్రకటన వెలువరించింది. ఆ పేలుడు తమ పనే అని ప్రకటించింది. గురుగ్రామ్ సెక్టార్ 29లోని ఓ బార్ వెలుపల మంగళవారం నాటు బాంబు పేలింది. ఆ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సచిన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మరో రెండు నాటు బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అతడిని విచారిస్తున్నారు (Gurugram Blast).


గురుగ్రామ్ బాంబు పేలుడు తమ పథకమే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన రోహిత్ గడర్, గోల్డీ బ్రార్ అనే వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇది చిన్న పేలుడే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని, భారీ విధ్వంసం సృష్టించగల సత్తా తమకు ఉందని పేర్కొన్నారు. ఆ బార్ యజమాని అక్రమ మార్గం ద్వారా రూ.కోట్లు సంపాదిస్తూ పన్నులు ఎగ్గొడుతున్నారని, అందుకే అతడిని హెచ్చరించామని తెలిపారు. అందరూ సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. ఈ పోస్ట్‌పై పోలీసులు దృష్టి సారించి విచారణ ప్రారంభించారు. అన్ని రకాలుగానూ దర్యాఫ్తు చేస్తున్నారు.


గత కొన్నేళ్లుగా జైలులోనే ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ పేరు ఇటీవలి కాలంలో మార్మోగిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆ కాల్పులు తమ పనే అని లారెన్స్ సోదరుడు అన్మోల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్మోల్ ప్రస్తుతం విదేశాలలో తల దాచుకుంటున్నాడు. జైలులో ఉంటూనే సెల్‌ఫోన్ ద్వారా లారెన్స్ బిష్ణోయ్ నేరాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 12 , 2024 | 03:47 PM