Share News

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:52 AM

వడగళ్లతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎలాం టి ఆందోళన చెందవద్దని వేములవాడ ఎమ్మెల్యే ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

చందుర్తి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : వడగళ్లతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎలాం టి ఆందోళన చెందవద్దని వేములవాడ ఎమ్మెల్యే ప్రభు త్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తండా పరిధిలో శని వారం వడగళ్ళ వర్షంతో దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 శాతం, కొన్ని ప్రాంతాల్లో 50 శాతం పంట నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్ట సమాచారం రాగానే కలెక్టర్‌తో మాట్లాడి సంబంధిత అధికారులకు తెలియజేశామన్నారు. కోతకు వచ్చిన పంట పొలాలు నష్టపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం పక్షాన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. నష్టపోయిన రైతుల కు ఎకరాకు పదివేల సహాయాన్ని అందిస్తామన్నారు. గత ప్రభుత్వం వడగళ్ల వల్ల నష్టపోయిన రైతన్నలను ఆదుకోలేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామ న్నారు. క్షేత్రస్థాయిలో జిల్లా పరిధిలో ఉన్న అధికారుల ప్రతి మండలంలో నష్టపరిహాన్ని నివేదిక తయారు చేయాలన్నారు. గ్రామాల్లో సమగ్ర విచారణ జరిపించి రిపోర్టు ప్రభుత్వానికి అందజేయాలన్నారు. అసెంబ్లీలో కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెప్పా మన్నారు. నష్టపోయిన రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందిస్తే ఎకరానికి రూ పది వేల ఆర్థిక సహాయం అందించే బాధ్య త ప్రభుత్వం తీసుకుంటుంద న్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రైతును రాజుగా చేస్తుందన్నారు. ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ చేసామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంట బీమా సౌక ర్యాన్ని కల్పించడానికి కృషి చేస్తు న్నారని పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుం టామనిమన్నారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్‌ తిరు పతి, మండల కాంగ్రెస్‌ నాయకులు రామస్వామి, కు మార్‌, ఉన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:52 AM