Share News

సిరిసిల్లలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:46 AM

సిరిసిల్ల పట్టణంలో పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు.

సిరిసిల్లలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

సిరిసిల్ల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల పట్టణంలో పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అన్నారు. ఆదివారం సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో సంజీవయ్యనగ ర్‌ కమాన్‌ వద్ద డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. నీరు నిలవకుండా వారంరోజుల్లో చర్యలు తీసుకోని సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ సమ్మయ్యను ఆదేశించారు. పనులు చేపట్టేందుకు ముందు మురికి నీరు వెళ్లే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. పద్మ నగర్‌లో ఈటీపీ ప్లాంట్‌ను పరిశీలించి నీరు నేరుగా కొత్త చెరువు వద్ద కు వెళ్లే విధంగా తీసుకోవాల్సిన వాటిపై సూచనలు చేశారు. చెరువు లు, మురికికాలువల వద్ద చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలు తొలగించాల ని మురికి కాలువల్లో పూడికలు తొలగించాలని అన్నారు. రోడ్ల వెంబడి చెత్త తొలగించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. సిరిసిల్లలో పందులు కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పందు ల పెంపకానికి ఐదెకరాల స్థలం ఇచ్చినా ఎందుకు బయట కనిపిస్తు న్నాయని ఆగ్రహాం వ్యక్తంచేశారు. శ్రీనగర్‌ కాలనీలో డ్రైనేజీ సమస్యను స్థానికులు కలెక్టర్‌ దృష్టికి తీసుకవచ్చారు. కాలనీలో రోడ్డు మధ్యలో డివైడర్‌ ఏర్పాటు చేయాలని, ఇరువైపులా మొక్కలు నాటించాలని ఆదే శించారు. మురికినీరు చెత్త ఉండకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ఖాళీ స్థలాలు గుర్తించి వాటికి పన్నులు వేయాలని ఆదేశించారు. వారి వెంట మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్‌ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:46 AM