Delhi : ఇక ‘ఏసీ ఎకానమీ’గా గరీబ్‌ రథ్‌ రైళ్లు | Delhi : Ministry of Railways Has Decided to Install Newly Designed AC Economy Coaches in all Garib Rath Trains.
Share News

Delhi : ఇక ‘ఏసీ ఎకానమీ’గా గరీబ్‌ రథ్‌ రైళ్లు

ABN , Publish Date - Jul 23 , 2024 | 03:24 AM

కొత్తగా రూపొందించిన ఏసీ ఎకానమీ కోచ్‌లను అన్ని గరీబ్‌ రథ్‌ రైళ్లకు అమర్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ‘ప్రస్తుతం గరీబ్‌ రథ్‌ రైళ్లకు ఉన్న కోచ్‌లన్నీ పురాతనమైనవి.

Delhi : ఇక ‘ఏసీ ఎకానమీ’గా గరీబ్‌ రథ్‌ రైళ్లు

న్యూఢిల్లీ, జూలై 22: కొత్తగా రూపొందించిన ఏసీ ఎకానమీ కోచ్‌లను అన్ని గరీబ్‌ రథ్‌ రైళ్లకు అమర్చాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ‘ప్రస్తుతం గరీబ్‌ రథ్‌ రైళ్లకు ఉన్న కోచ్‌లన్నీ పురాతనమైనవి. అవి బాగా పాతబడిపోయాయి. వాటి స్థానంలో ఎల్‌హెచ్‌బీ ర్యాక్‌లతో కూడిన థర్డ్‌ ఏసీ ఎకానమీ కోచ్‌లు అమర్చాలని నిర్ణయించాం’ అని రైల్వేశాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. కొత్త ర్యాక్‌లతో కూడిన రైళ్లను కొన్ని రూట్‌లలో ఈనెల నుంచే నడపనున్నామన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Jul 23 , 2024 | 03:24 AM

News Hub