Share News

Cricket Retirement : వరుణ్‌ ఆరోన్‌ రిటైర్మెంట్‌

ABN , Publish Date - Jan 11 , 2025 | 05:42 AM

భారత పేసర్‌ వరుణ్‌ ఆరోన్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో జార్ఖండ్‌ తరఫున అతడికి చోటు దక్కలేదు.

Cricket Retirement : వరుణ్‌ ఆరోన్‌ రిటైర్మెంట్‌

న్యూఢిల్లీ: భారత పేసర్‌ వరుణ్‌ ఆరోన్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో జార్ఖండ్‌ తరఫున అతడికి చోటు దక్కలేదు. దీంతో 35 ఏళ్ల వరుణ్‌ ఆటకు అల్విదా చెప్పడమే మేలని భావించాడు. 2023-24 సీజన్‌లో తను ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ‘20 ఏళ్లుగా క్రికెట్టే శ్వాసగా జీవించాను. అందుకే పూర్తి సంతృప్తితో ఆట నుంచి వైదొలుగుతున్నా’ అని వరుణ్‌ ప్రకటించాడు. 2010-11 విజయ్‌ హజారే ట్రోఫీలో 150 కి.మీ వేగంతో బంతి విసిరి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దీంతో అదే ఏడాది ఆరోన్‌ భారత్‌ తరఫున వన్డే, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2015లో చివరి టెస్టు ఆడాడు. ఐపీఎల్‌లోనూ పలు జట్ల తరఫున బరిలోకి దిగిన వరుణ్‌ మొత్తంగా 9 టెస్టుల్లో 18, 9 వన్డేల్లో 11 వికెట్లు తీశాడు.

Updated Date - Jan 11 , 2025 | 05:42 AM