Celebrity News : రేడియో జాకీతో చాహల్ డేటింగ్ ?
ABN , Publish Date - Jan 11 , 2025 | 05:46 AM
భారత జట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి.
ముంబై: భారత జట్టు స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు విడిపోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లను చాహల్ కానీ ధనశ్రీకానీ ఖండించకపోవడంతో..అవి నిజమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో శుక్రవారం నెట్టింట్లో దర్శనమిచ్చిన ఫొటోలు చాహల్ దంపతులు విడిపోతున్నారనే వార్తలకు బలం చేకూర్చింది. తాను, చాహల్ కలిసి ఉన్న ఫొటోలను 28 ఏళ్ల రేడియో జాకీ మహవాష్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. క్రిస్మస్ సంబరాలను చాహల్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నానని వెల్లడించిన మహవాష్.. ‘చాహల్ నా ఫ్యామిలీ’ అని రాయడం సంచలనం రేపింది. దాంతో మహవా్‌షతో చాహల్ డేటింగ్‌లో ఉన్నాడంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.