National : దూరదర్శన్ కిసాన్‌లో రోబో యాంకర్లు
ABN , Publish Date - May 25 , 2024 | 05:16 AM
ప్రభుత్వ రంగంలోని దూరదర్శన్ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంది.
న్యూఢిల్లీ, మే 24: ప్రభుత్వ రంగంలోని దూరదర్శన్ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంది. కృత్రిమ మేథ ఆధారంగా పనిచేసే యాంకర్లను ప్రవేశపెట్టనుంది. రైతుల కోసం పనిచేసే దూరదర్శన్ కిసాన్‌లో ఇద్దరు వర్చుయల్ యాంకర్ల ద్వారా ఇకపై సమాచారం అందించనుంది. ‘ఏఐ క్రిష్’, ‘ఏఐ భూమి’ అన్న పేర్లు కలిగిన ఈ ఏఐ యాంకర్లు ఇకపై వార్తలు చదువుతారు. ఈ నెల 26వ తేదీన దూరదర్శన్ కిసాన్ తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వీటిని ఆవిష్కరిస్తారు.