Share News

Elon Musk: ప్రధాని మోదీకి ఎలన్ మస్క్ అభినందనలు..

ABN , Publish Date - Jul 20 , 2024 | 09:41 AM

టెస్లా అధినేత, ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ``ఎక్స్``లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన ప్రపంచ నాయకుడిగా నిలిచిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

Elon Musk: ప్రధాని మోదీకి ఎలన్ మస్క్ అభినందనలు..
Elon Musk congratulates PM Modi

టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రధాని మోదీ (PM Modi)కి అభినందనలు తెలియజేశారు. మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ``ఎక్స్`` (X)లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన ప్రపంచ నాయకుడిగా నిలిచిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిని ``ఎక్స్`` ద్వారా 100 మిలియన్ల మంది (10 కోట్లు) అనుసరిస్తున్నారు. ``అత్యధిక మంది అనుసరించే ప్రపంచ నాయకుడు అయిన ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు`` అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు (Most followed world leader on X).


``ఎక్స్``లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన ప్రపంచ నాయకులలో ప్రధాని మోదీ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉన్నారు. బైడెన్‌ను ఎక్స్‌లో 37 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక, ఆ తర్వాత పోప్ ఫ్రాన్సిస్ 18 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉండగా, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ 17 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఐదో స్థానంలో ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు 15 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. ఆయన ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.


గత మూడేళ్లలోనే ప్రధాని మోదీ ``ఎక్స్`` ఫాలోవర్ల సంఖ్య దాదాపు 30 మిలియన్లు పెరిగింది. ఇక, దేశంలోని ఇతర నేతల సోషల్ మీడియా ఫాలోయింగ్ మోదీతో పోల్చుకుంటే చాలా తక్కువ. కాగా, గతంలో ట్విటర్ పేరుతో ఉండే మైక్రో బ్లాగింగ్ సైట్‌ను మస్క్ దక్కించుకుని దాని పేరును ``ఎక్స్`` అని మార్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

CM Yogi Adityanath : కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమాని పేరు ఉండాల్సిందే


JP Nadda: కాంగ్రెస్‌ను 'రాజకీయ పరాన్నజీవి'గా పోల్చిన నడ్డా


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 20 , 2024 | 10:04 AM